టోక్యో ఒలంపిక్స్ లో ఇప్పటికే భారత్ కి ఒక పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో స్నాచ్‌లో మొదటి ప్రయత్నంలో 84 కేజీలను ఎత్తిన మీరాభాయ్, రెండో ప్రయత్నంలో 87కేజీలు ఎత్తి... తొలి హాఫ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా వెయిల్ లిఫ్టర్ హో జీహుయ్ 94 కేజీలు లిప్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది.

28
కాగా.. ఈ పతకం గెలిచే సమయంలో.. మీరాబాయి చాను ధరించిన ఇయర్ రింగ్స్ వెనక పెద్ద కథే ఉంది. ఆమె ధరించిన ఇయర్ రింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
38
వాటి వెనక ఒక ఎమోషనల్ కథ కూడా ఉంది. ఆ విషయం ఆమె విజయం సాధించిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. ఆ కథేంటో మనమూ తెలుసుకుందాం.
Mirabai Chanu
48
మీరు గమనించే ఉంటారు.. ఆమె ధరించిన ఇయర్ రింగ్స్.. ఒలంపిక్స్ రింగ్ షేప్ లో ఉంటాయి. వీటిని.. ఐదేళ్ల క్రితం.. మీరాకి ఆమె తల్లి బహుమతిగా ఇచ్చారట. తన బంగారం అప్పి మరీ.. ఈ ఇయర్ రింగ్స్ ని చేయించడం విశేషం.
Mirabai Chanu
58
రియో ఒలంపిక్స్ కి ముందే.. ఈ ఇయర్ రింగ్స్ ని గిఫ్ట్ గా ఇచ్చిందట. వాటిని ఆమె ఇప్పుడు టోక్యో ఒలంపిక్స్ లో ధరించడం గమనార్హం. ఇప్పుడు టోక్యో ఒలంపిక్స్ లో ఆమె పతకం సాధించడం పట్ల మీరా భాయ్ చాను తల్లి సంతోషం వ్యక్తం చేశారు.
Mirabai Chanu Mother
68
‘‘ నేను నా కూతురు ఇయర్ రింగ్స్ టీవీలో చూశాను. 2016 లో అవి ఆమెకు నేను నా బంగారం తాకట్టుపెట్టి.. వాటిని చేయించి ఇచ్చాను. ఇప్పుడు ఈ టోక్యో ఒలంపిక్స్ లో అదృష్టం వరించి ఆమెను విజయం వరించింది.’’ అంటూ మీరా తల్లి పేర్కొన్నారు.
Chanu Saikhom Mirabai
78
తమ కుమార్తె విజయం సాధించింది అని తెలియగానే.. తాను, తన భర్త చాలా ఎమోషనల్ అయ్యామని.. కన్నీరు కూడా పెట్టుకున్నామని చెప్పారు. ఆమె పడిన కష్టమే.. ఈ విజయం దక్కడానికి కారణమైందని ఆమె పేర్కొన్నారు.
Mirabai Chanu
88
ఈ ఒలంపిక్స్ లో బంగారం లేదా సిల్వర్ పతకం సాధించి తీరతానని తన కూతురు తమకు మాటిచ్చిందని.. అయితే.. అది నిజమయ్యే వరకు తాము ఎదరుచూస్తూనే ఉన్నామని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు తన కూతురికి శుభాకాంక్షలు చెప్పేందుకు స్నేహితులు, బంధువులు చాలా మంది తమ ఇంటికి వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.