ఇంట్లోనే పార్లర్.. మెరిసే నిగారింపు కోసం ఇలా చేయండి..!

First Published | Aug 16, 2021, 12:12 PM IST

బాదం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపైని నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మరి దీని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

చర్మం మెరిస్తూ.. నిగారింపుని ఇస్తే.. ఎవరైనా సరే అందంగా మెరిసిపోవాల్సిందే. అయితే.. అందుకోసం ఏ బ్యూటీ పార్లర్ ని పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని.. మీరే ఇంట్లో లభించే పదార్థాలతో పార్లర్ గా మార్చేసుకోవచ్చు. ముఖ్యంగా.. సహజ పదార్థాలతో చర్మ సంరక్షణను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

badam face pack

మెరిసే చర్మానికి బాదం పప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. బాదం పప్పు రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని మనకు తెలుసు. కానీ.. అదే బాదం పప్పు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి సహాయం చేస్తుంది.

skin care

Latest Videos


బాదం పప్పులో విటమిన్ ఇ, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. బాదం పప్పుతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మరింత అందంగా మెరవచ్చు.
undefined
బాదం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల ముఖం పై మడతలు తగ్గిపోతాయి. చర్మంపైని నల్లని మచ్చలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మరి దీని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
undefined
రాత్రిపూట నాలుగు లేదా ఐదు బాదం పప్పులను పాలల్లో నానపెట్టాలి. మరుసటి రోజు వాటి పొట్టు తీసేసి.. పాలల్లో మరగనివ్వాలి. తర్వాత మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిని రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. తెల్లారిన తర్వాత.. దానిని కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడు, నాలుగుసార్లు చేస్తే.. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.
undefined
ఇది మాత్రమే కాదు.. బాదం నూనె కూడా ముఖానికి చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు రెండు లేదా మూడు బాదం నూనెను కళ్ల చుట్టూ రాసి.. మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి వలయాలు పోతాయి.

skin care

అంతేకాదు.. ముఖంపై నల్లని మచ్చలను తొలగించడానికి.. బాదం నూనె, తేనె కలిసి రాసుకోవడం వల్ల.. ముఖం మరింత కాంతివంతంగా మెరుస్తుంది.

skin

click me!