ముఖంపై వృద్ధాప్య ఛాయలు.. పోగొట్టేదెలా..?

First Published Aug 12, 2021, 3:16 PM IST

బొప్పాయి గుజ్జును ముఖానికి రాసి.. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల  చర్మానికి మేలు చేస్తుంది.

మన వయసు పెరుగుతోంది అనడానికి.. మన శరీరంలో ముఖం ఒక్కటి చూస్తే చాలు. ముఖంలో వచ్చే మార్పులతో మనం వృద్ధాప్యంలోకి చేరుకుంటున్నామని గుర్తించవచ్చు. అయితే.. ఎవరికి మాత్రం త్వరగా ముసలివారు కావాలని ఉంటుంది చెప్పండి. కానీ.. దానిని ఆపలేం కదా అని మీరు అనుకోవచ్చు. వృద్ధాప్యానికి చేరుకోకుండా ఆపలేకపోవచ్చు. కానీ.. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడేలా మాత్రం చేసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ageing

కొన్ని రకాల చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల ముఖం ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

wrinkles

మంచినీరు ఎక్కువగా తాగేవారు ముఖం యవ్వనంగా కనపడుతుందట. కాబట్టి ప్రతిరోజూ 8 గ్లాసుల మంచినీరు తాగాలని.. దాని వల్ల ఆరోగ్యంతోపాటు.. అందం కూడా మీ సొంతమౌతుందని చెబుతున్నారు.
undefined
తినే ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించాలి. అంతేకాకుండా.. షుగర్ వాడకాన్ని కూడా తగ్గిస్తే.. చర్మానికి మేలు చేస్తుంది.
undefined
మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా నారింజ, క్యారెట్, అవకాడోలకు ఎక్కువ చోటు ఇవ్వాలి. ఇవి చర్మంపై ముడతలు తగ్గించి.. చర్మం నిగారించడానికి సహాయం చేస్తుంది.
undefined
చర్మ ఆరోగ్యానికి నిద్ర కూడా చాలా కీలకం. కాబట్టి సరిపడా నిద్ర పోవాలి. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం

sleeping on the back

ఏకాలంలో నైనా చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ వాడటం ఆపకూడదు. ఇది చర్మాన్ని ఇతర సమస్యలు రాకుండా కాపాడుతుంది.
undefined
మేకప్ ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడకుండా ఉండటం మంచిది.

makeup

బొప్పాయి గుజ్జును ముఖానికి రాసి.. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మానికి మేలు చేస్తుంది.

papaya

ఒక స్పూన్ కాఫీ పౌడర్ లో రెండు స్పూన్ల తేనె కలిపి ముఖానికి, మెడకు రాయాలి. ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
undefined
టీ స్పూన్ పసుపులో పెరుగు వేసి బాగా కలిపి.. దానికి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.
undefined
click me!