తమన్నా తన కనుబొమ్మలను కూడా అందంగా అలంకరించుకుంటుంది. ఈమె కనుబొమ్మలు సుతిమెత్తగా కనిపించేలా, అందంగా కనిపించే ఫేస్ మేకప్, పెదవులను ఎర్రగా ఉంచే సింపుల్ మేకప్ ను వాడుతూ అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటుంది. పీచ్ ఐషాడో, పింక్ పెదాలతో, తమన్నా మినిమల్ మేకప్ ఎప్పుడూ ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే తమన్నా గోల్డ్ టోన్డ్ న్యూడ్ మేకప్ లుక్ కూడా ఈమెను బ్యూటీఫుల్ గా మార్చేస్తుంది.