అంబానీ పెళ్లిలో లెహంగాలో మెరిసిన తమన్నా... ధర ఎంతో తెలుసా?

First Published | Jul 16, 2024, 4:43 PM IST

అనంత్- రాధికల వివాహానికి చాలా మంది సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. కాగా.. ఆ వివాహానికి హాజరైన వారిలో తమన్నా కూడా ఉండటం విశేషం.

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ తమన్నా. దశబ్దానికి పైగా ఆమె తెలుగు సినిమాల్లో నటించి అందరినీ మెరిపించారు. ఇటీవల బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె.. వరసగా ఛాన్సులు అందుకుంటోంది. 

ముఖ్యంగా.. ఓటీటీ షోల్లో ఛాన్సులు అందుకుంటూ... తన ఫ్యాన్స్ ని ఇంకా పెంచుకుంటున్నారు. కాగా.. తమన్నా.. తన కెరీర్ మొదలుపెట్టినప్పుడు ఎంత అందంగా ఉందో.. ఇప్పటికీ అంతే అందంగా కనపడుతుంది.
 


Tamannaah Bhatia

నిజం చెప్పాలంటే.. వయసుతో పాటు ఆమె అందం కూడా పెరుగుతుందనే చెప్పాలి. ఈ సంగతి పక్కన పెడితే... రీసెంట్ గా మన దేశ అంత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిగిన విషయం తెలిసిందే.

అనంత్- రాధికల వివాహానికి చాలా మంది సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. కాగా.. ఆ వివాహానికి హాజరైన వారిలో తమన్నా కూడా ఉండటం విశేషం.

Tamannaah Bhatia

తమన్నా.. ఆ పెళ్లి వేడుకకు.. కళ్లు చెదిరిపోయేలా నలుపు రంగు లెహంగా ధరించి మరీ వెళ్లారు. ఆమె లెహంగా లుక్, హెయిర్ స్టైల్, జ్యూవెలరీ అన్నీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఆ లెహంగాకు ఆమె పెట్టిన ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 
 

Actress Tamannaah Photoshoot

తమన్నా బ్లాక్ లెహంగాలో అందంగా కనిపిస్తోంది. గోల్డెన్ వర్క్‌తో కూడిన బ్లాక్ లెహంగా చోలీని కరణ్ థోరానీ డిజైన్ చేశారు. ఈ లెహంగా ధర దాదాపు నాలుగు లక్షల రూపాయలు కావడం విశేషం.

Tamannaah

అంబానీ ఇంట్లో పెళ్లికి గెస్ట్ గా వెళ్తున్నారంటే... ఆ మాత్రం ధర పెట్టాల్సిందే లే అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. లెహంగా ధర ఎలా ఉన్నా..ఈ లుక్ లో తమన్నా మాత్రం చాలా అద్బుతంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. 
 

Latest Videos

click me!