మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా... ముకేష్ అంబానీ తన ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం చాలా గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అంబానీ కుటుంబానికి సంబంధించిన వార్తలే వినపడుతున్నాయి. ఎక్కువ మంది.. అంబానీ కొత్త కోడలి గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. నెట్టింట ఎక్కువగా వెతుకుతున్నారట కూడా. మరి.. అంబానీ ఇంట అడుగుపెట్టిన ఇద్దరు కోడళ్లు.. ఏం చదువుకున్నారు..? వారి బ్యాగ్రౌండ్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం....
1.శ్లోకా మెహతా..
ముకేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా. ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా, మోనా మెహతాల కుమార్తే. ఆకాశ్- శ్లోకాలది కూడా ప్రేమ వివాహమే. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత.. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శ్లోకా మెహతా... ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే పాఠశాల విద్యను అభ్య సించారు. తర్వాత... న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుండి ఆంత్రోపాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించింది, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందింది.
2.రాధిక మర్చంట్...
ఇక.. అంబానీ కొత్త కోడలు, చిన్న కోడలు రాధిక మర్చంట్. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారిన రాధిక.. ఈ నెల 12వ తేదీన అంబానీ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. రాధిక- అనంత్ లది కూడా ప్రేమ వివాహమే. రాధిక మర్చంట్ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ , అతని భార్య శైలాల చిన్న కుమార్తె. రాధిక ముంబైలోని కేథడ్రల్ , జాన్ కానన్ స్కూల్ , ఎకోల్ మొండియాల్ వరల్డ్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు , ఆర్థిక శాస్త్రాలను అభ్యసించింది. రాధిక కూడా తన అత్తగారు నీతా అంబానీలాగే భరతనాట్యంలో శిక్షణ పొందింది.