నీతా అంబానీ తాగే కాఫీ ఎన్ని లక్షలో తెలుసా?

First Published | Jul 16, 2024, 9:52 AM IST

నీతా అంబానీ గురించి  మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ కోటీశ్వరురాలు.. ఎంత లగ్జరీ లైఫ్ లో బతుకుతుందో ఎవ్వరికీ తెలియదు. అసలు ఉదయం తాగే కాఫీ ధరే లక్షల్లో ఉంటుందంటే నమ్మండి. 

ముఖేష్ అంబానీ వైఫ్ నీతా తన స్టైల్ కు , గ్లామరస్ లైఫ్ కు పెట్టింది పేరు. 60 ఏండ్ల వయసులో కూడా 30 ఏండ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. నీతా తన స్టైల్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈమె ఫోటోలను చూసిన ప్రతిసారి.. ఈ వయసులో ఇలా ఉండటం సాధ్యమా అనిపించేలా చేస్తుంది. అయితే నీతా అంబానీకి సంబంధించి ఇలాంటి సీక్రెట్ విషయాలు చాలానే ఉన్నాయి. ఇవి అందరికీ తెలియవు. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

3 లక్షల కాఫీతో.. 

మనం తాగే కాఫీ ఖరీదు 10 నుంచి 50 రూపాయల మధ్య ఉండొచ్చు. కానీ కోటీశ్వరురాలైన నీతా అంబానీ కాఫీ ధర మాత్రం వందలు కాదు వేలు కాదు లక్షల్లోనే ఉంటుంది. అవును ఈమె ఉదయాన్నే నిద్రలేచి రూ.3 లక్షల విలువైన కాఫీతో తన డేను స్టార్ట్ చేస్తుంది. 
 


ఖరీదైన హ్యాండ్ బ్యాగులు.. 

నీతా అంబానీ ప్రతి ఫోటోలో డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్ తో కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు పెద్దగా గమనించకపోవచ్చు కానీ.. నీతా అంబానీ దగ్గర చాలా రకాల హ్యాండ్ బ్యాక్ కలెక్షన్లు ఉంటాయట. అందులోనూ ఈమె ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ ల ఖరీదు వింటే నోట్లో నుంచి మాట రాదు. అవును నీతా అంబానీ దగ్గర 2.21 కోట్ల విలువైన హ్యాండ్ బ్యాగ్ ఉందట. ఈమె దగ్గర జిమ్మీ చూ, గోయార్డ్  వంటి ఎన్నో బ్యాగులు ఉంటాయి. ఇవి చాలా కాస్ట్లీ. 

లగ్జరీ కార్లు.. 

నీతా అంబానీకి కార్లంటే చాలా ఇష్టమంట. ముఖ్యంగా లగ్జరీ కార్లు. అందుకే ఈమె నచ్చిన కార్లను తరచుగా కొంటుందట. ముఖ్యంగా ఈమెకు ఇష్టమైన కారు మేబాక్ 62. దీని ధర ఎంత అనుకుంటున్నారు. అక్షరాల రూ.10 కోట్లు.

శాకాహారం 

నీతా అంబానీ మాంసాహారాన్ని అస్సలు తినదు. ఈమె ఒక్క వెజ్ ఫుడ్ ను మాత్రమే తింటుంది. అది కూడా హెల్తీగా. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే? నీతా అంబానీకి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టమట.
 

స్కూల్ టీచర్.

నీతా అంబానీ తన చిన్న వయసులోనే ప్రొఫెషనల్ భరతనాట్య కళాకారిణి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే స్కూల్ టీచర్ కూడా. అవును ఈమెకు పిల్లలకు చదువు చెప్పడమంటే చాలా ఇష్టమట. నీతా ఓ స్కూల్లో టీచర్ గా పనిచేసే సమయంలోనే ముఖేష్ అంబానీతో పరిచయం ఏర్పడిందట.

బిజినెస్

నీతా అంబానీ భర్త ముఖేష్ అంబానీ, కొడుకు బిజినెస్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియని విషయమేంటంటే? నీతా అంబానీ కూడా బిజినెస్ చేస్తోంది. ఆమె కొన్ని వ్యాపారాలను స్వయంగా నిర్వహిస్తూ.. తన భర్తకు సంబంధించిన పలు వ్యాపారాలను కూడా స్వయంగా నిర్వహిస్తోంది.

స్ట్రిక్ట్ మదర్

నీతా అంబానీ మదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదట. నీతా అంబానీకి ఆమెతో కలిసి తినాలని, ఆడుకోవాలని, చదువుకోవాలని అనుకునేదట. 
 

Latest Videos

click me!