మాజీ విశ్వ సుందరి సుష్మితాసేన్..లగ్జరీ హౌస్ చూశారా..?

First Published Jun 9, 2021, 2:54 PM IST

సుష్మితా సేన్ ఇంట్లో లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెటల్ సీట్ సోఫా,  చెక్క టేబుల్ తో గ్లాస్ క్యాబినెట్ ఉన్నాయి. ఈ హాల్ చాలా పెద్దది.. చాలా అందంగా కూడా ఉంటుంది.
 

మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. ఇటీవల ఆర్య అనే వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అంతకముందు.. వరస సినిమాల్లో నటించి.. తన అంద చందాలతో ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ లోనూ అంతేబాగా ఆకట్టుకున్నారు.
undefined
ఈ మాజీ విశ్వసుందరి.. అవుట్ సైడ్ మాత్రమే కాదు.. ఇన్ సైడ్ కూడా బ్యూటీఫుల్. అందుకే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని సొంత కూతుళ్లలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ కూతుళ్లతో కలిసి ఆమె ఉంటున్న ఇల్లు చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
undefined
సుష్మితా సేన్ ఇంట్లో లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మెటల్ సీట్ సోఫా, చెక్క టేబుల్ తో గ్లాస్ క్యాబినెట్ ఉన్నాయి. ఈ హాల్ చాలా పెద్దది.. చాలా అందంగా కూడా ఉంటుంది.
undefined
సుస్మితా బెడ్రూమ్ చూస్తే.. మొత్తం వైట్ వాల్స్.. పెద్ద బెడ్ ఉంటుంది. దీనికి చెక్క హెడ్‌బోర్డ్ పెద్ద కిటికీలు ఉన్నాయి. దీనితో పాటు, ఈ గదిలో అందమైన బెడ్ ల్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు.
undefined
ఇక సుష్మితా ఇంట్లోనే సీటింగ్ ఏరియా ఇంకా చాలా అందంగా ఉంటుంది. అక్కడ గోడలకు అందమైన పెయింటింగ్స్ ఉంటాయి. క్రీమ్ కలర్ సోఫా, ముదురు గోధుమ రంగు కుషన్లు మరింత అందాన్ని తీసుకువచ్చాయి
undefined
సుష్మితా సేన్ తన బెడ్రూమ్ లో వర్కౌట్స్ కూడా చేస్తుంది. బెడ్‌రూమ్‌ను జిమ్‌గా మార్చి ఇక్కడ చేసిన వర్కౌట్స్ వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా సార్లు సుష్మిత తన ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో కలిసి వర్కౌట్స్ చేశారు. ఆ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
ఇదే గదిలో సుష్మిత పెద్ద కుమార్తె రీనీ కథక్ క్లాసెస్ నేర్చుకుంటుంది. ఏవైనా సెలబ్రేషన్స్ ఉన్నా ఈ గదిలోనే సెలబ్రేట్ చేసుకుంటారు.
undefined
సుష్మిత తన 24ఏళ్ల వయసులో ఓ పాపను దత్తత తీసుకున్నారు. ఆమె పెద్ద కుమార్తె వయసు ఇప్పుడు 20 సంవత్సరాలు.
undefined
ఇక ఆమె తన 45ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారు. తన కన్నా వయసులో 16ఏళ్ల చిన్నవాడైన రోహ్మన్ షాల్ తో ఆమె ఇటీవల ప్రేమలో పడ్డారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.
undefined
ఈ ఏడాది చివరల్లో సుష్మిత తన ప్రియుడిని పెళ్లాడాలని అనుకున్నారు. అయితే.. ఈ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.
undefined
click me!