1. జుట్టు ఎదుగుదలకు: ఆర్గాన్ + ఆముదం నూనె
ఆర్గాన్ నూనెలో విటమిన్ ఇ, ఒలిక్ , లినోలిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆముదంతో కలిపి వాడితే:
తలకు అవసరమైన తేమ అందుతుంది.చుండ్రు పేరుకుపోకుండా ఉంటుంది.జుట్టు సహజంగా, ఒత్తుగా పెరుగుతుంది.
2. పలుచని జుట్టుకు: ఆముదం + కొబ్బరి నూనె
ఆముదం నూనె చిక్కగా ఉంటుంది, కాబట్టి దీనిని కొబ్బరి నూనెతో కలిపి వాడటం మంచిది. ఈ నూనె రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు తేమను అందించి జుట్టును బలంగా చేస్తుంది.చుండ్రు సమస్య కూడా ఉండదు.
3. జుట్టు మరీ బలహీనంగా ఉంటే: ఆవ నూనె
ఆవ నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు , జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి నూనెలో ఈ ఆవ నూనె కలిపి రాస్తే.. జుట్టు బలంగా మారుతుంది. తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు.
4. చుండ్రు , ఇన్ఫెక్షన్లకు: వేప నూనె
వేపలో ఉండే అజాడిరాక్టిన్, నింబిన్ వంటి సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి.
తల చర్మంపై ఉండే బాక్టీరియా, ఫంగస్ ను నిర్మూలిస్తుంది. వారానికి రెండుసార్లు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే చుండ్రు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
5. దెబ్బతిన్న (Damaged) జుట్టుకు: ఆలివ్ నూనె
పొడిబారిన, గరుకైన జుట్టు ఉన్నవారికి ఆలివ్ నూనె ఒక వరప్రసాదం.ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టును మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెతో కలిపి మసాజ్ చేయడం వల్ల దెబ్బతిన్న జుట్టు కుదుళ్లు మళ్ళీ జీవం పోసుకుంటాయి. జుట్టు అందంగా కూడా కనిపిస్తుంది.