యవ్వనంగా కనిపించేందుకు ఏ నీటితో స్నానం చేయాలి..?

First Published Sep 7, 2021, 3:14 PM IST

వేల రూపాయల క్రీములు ఒంటికి రాస్తే సరిపోదు. వాటిలో అన్నీ మనకు పడతాయనే గ్యారెంటీ ఉండదు. దాని వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

skin care

యవ్వనంగా కనిపించాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే.. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. వేల రూపాయల క్రీములు ఒంటికి రాస్తే సరిపోదు. వాటిలో అన్నీ మనకు పడతాయనే గ్యారెంటీ ఉండదు. దాని వల్ల ఇతర చర్మ సమస్యలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా కాకుండా.. ఈ సమస్యలు రాకుండా చర్మాన్ని అందంగా కనిపించేలా చేసుకోవాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో కావాలో ఇప్పుడు చూద్దాం..

చాలా మంది వేడి వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. నిజానికి చల్లటి నీటితో స్నానం చేస్తే.. మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుందట. దాని వల్ల చర్మం అందంగా మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటితో షవర్ బాత్ చేస్తే..  చర్మంలో నిగారింపు పెరుగుతుందట.

కొందరికి కాఫీ తాగే అలవాటు ఉంది. అయితే.. మరీ ఎక్కువగా కప్పుల కొద్దీ కాఫీ తాగితే మాత్రం.. వృద్ధాప్య ఛాయలు రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీ, డీట్యాక్సిన్ వాటర్ లాంటివి తాగడం ఉత్తమమని సూచిస్తున్నారు.
 

బ్రీతింగ్ వ్యాయామాలు చేసేవారి చర్మం కూడా అందంగా మెరుస్తుందట. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగి.. చర్మం యవ్వనంగా మెరవడానికి సహాయం చేయంలో.. ఈ వ్యాయామాలు బాగా పనిచేస్తాయట.

skin care

ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో అయినా.. మంచిగా ఆలోచించడం నేర్చుకోవాలట. పాజిటివ్ థింకింగ్ ఉన్నవారిలో ఎప్పుడూ గుడ్ , హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. అప్పుడు చర్మం కూడా అందంగా కనపడుతుంది.

ఇక చర్మం అందంగా కనిపించడం అనేది మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యంగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అందంగా మెరిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

click me!