ఈ మధ్యకాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. అందుకోసం మార్కెట్లో లభించే ఎన్నో రకాల షాంపూలను ప్రయత్నించినా.. అవి ఫలితం ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ చుండ్రు వచ్చేస్తూ ఉంటుంది.
ఈ చుండ్రు చాలా రకాల కారణాల వల్ల వచ్చేస్తుంది. ఈ చుండ్రు కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. తద్వారా.. మనలోని ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
చుండ్రు ఎలా వచ్చిందనే విషయం గురించి ఆలోచించడం కన్నా.. దానిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ చుండ్రు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవచ్చని వారు చెబుతున్నారు.
ముఖ్యంగా జుట్టుకి నూనె లేకుండా.. జిడ్డు, మురికి లేకుండా ఉండేలా చూసుకుంటే.. చుండ్రు త్వరగా దరిచేరదట. చుండ్రును నివారించడం వల్ల జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.
ముఖ్యంగా జుట్టుకి నూనె లేకుండా.. జిడ్డు, మురికి లేకుండా ఉండేలా చూసుకుంటే.. చుండ్రు త్వరగా దరిచేరదట. చుండ్రును నివారించడం వల్ల జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.
మెంతులు చుండ్రు సమస్యను తగ్గించడంతోపాటు.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. మరి ఈ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా.. మెంతులను ఎక్కువ సేపు నానపెట్టాలి. తర్వాత.. దానిని పేస్టులాగా రుబ్బుకోవాలి. దాంట్లో ఈ పేస్టులో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి.
ఆరిపోయిన తర్వాత. శుభ్రంగా నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల.. జుట్టు రాలడం సమస్యను తగ్గించవచ్చు.
ఈ మెంతుల పేస్టులో కొద్దిగా పెరుగువేసి కలపి రాసుకోవడం వల్ల.. చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది. పెరుగు బదులు.. గుడ్డు కూడా ఉపయోగించవచ్చు. జుట్టు అందంగా మెరవడానికి సహాయం చేస్తుంది.