ముఖానికి దానిమ్మ తొక్కల్ని ఇలా పెడితే.. మీరు పార్లర్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు

First Published | Dec 25, 2024, 10:28 AM IST

దానిమ్మ పండ్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీని తొక్కలు మాత్రం మనకు ఉపయోగపడవని అనుకుంటారు. కానీ ఈ తొక్కల్ని ముఖానికి పెడితే మీరు పార్లర్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు తెలుసా.

దానిమ్మ గింజల్ని తినేసి, దాని తొక్కల్ని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. ఎందుకంటే ఇవి దేనికీ పనికిరావని అనుకుంటారు. కానీ దానిమ్మ తొక్కల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని చర్మ సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ తొక్కల్లో విటమిన్ సి, యాంటీ  ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి. 

ఈ తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడానికి సహాయపడతాయి. తొక్కల్లో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మపు చికాకును తగ్గిస్తాయి. అలాగే చర్మం ఎరుపును కూడా తగ్గించడానికి సహాయపడతాయి. ఇకపోతే దీనిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. అలాగే చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

చర్మ సంరక్షణలో దానిమ్మ తొక్కల్ని ఉపయోగించడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. అలాగే చర్మ ఆకృతి మెరుగుపడుతుంది. సహజంగా అందంగా కనిపిస్తారు. అందుకే ముఖానికి దానిమ్మ తొక్కల్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


దానిమ్మ తొక్క వల్ల కలిగే బ్యూటీ బెనిఫిట్స్

యాంటీఆక్సిడెంట్ రక్షణ

దానిమ్మ తొక్కలో ఎల్లాజిక్ ఆమ్లం, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి సహాయపడతాయి. అలాగే మీ చర్మాన్ని కాలుష్యం నుంచి రక్షిస్తాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు

దానిమ్మ తొక్కల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని చికాకు నుంచి కాపాడుతాయి. అలాగే చర్మం ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
 

కాంతివంతమైన చర్మం 

దానిమ్మ తొక్కలో పుష్కలంగా ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి, చర్మ రంగును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. దానిమ్మ తొక్కల్ని ముఖానికి పెట్టడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. 

కొల్లాజెన్ ఉత్పత్తి

దానిమ్మ తొక్కల్ని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడవు. అలాగే దానిమ్మ తొక్కలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తాయి. దీంతో మీ చర్మం దృఢంగా ఉంటుంది. మీరు యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాదు ఈ తొక్కలు మీ చర్మాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతాయి. దీంతో మీ చర్మం పొడిబారే అవకాశం ఉండదు. ఈ తొక్కలు మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

Latest Videos

click me!