ఉసిరికాయ మన ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లాంటిది తెలుసా? ఎందుకంటే దీనిలో ఉండే ఎన్నో ఔషద లక్షణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి. ఈ ఉసిరికాయలు చలికాలంలో బాగా దొరుకుతాయి. ఇంకేముంది వీటిలో పచ్చళ్లు, పులిహోర వంటి రకరకాల వంటలు చేసుకుని తింటుంటారు.
అయితే ప్రతి ఒక్కరూ ఉసిరి గుజ్జును మాత్రమే ఉపయోగిస్తారు. వీటి గింజలు పనికిరావని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ ఈ గింజలు కూడా మనకు ఉపయోగపడతాయి తెలుసా? వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి మంచి టేస్ట్ గా కూడా ఉంటాయి. అందుకే వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
amla
మసాలా దినుసుగా ఉసిరికాయ గింజల పొడి
ఉసిరి గింజలను మసాలా దినుసుగా కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఈ గింజల పొడిని వాడండి. ఈ మసాలా పొడిని తయారుచేయడానికి ఉసిరి గింజల్ని 3 నుంచి 4 రోజుల పాటు ఎండబెట్టండి. ఆ తర్వాత వీటిని బ్లెండర్ లో మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పొడిని మీకు నచ్చిన రకరకాల వంటల్లో మసాలాగా ఉపయోగించుకోండి. బిర్యానీ లేదా పులావ్ పై కొంచెం ఉసిరి పొడిని చల్లితే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీన్ని సూప్ లల్లో కూడా వేయొచ్చు.
ఉసిరి గింజల పచ్చడి
అవును ఉసిరి గింజల పచ్చడిని కూడా తయారుచేయొచ్చు. మీరు ఇంట్లో తయారుచేసిన పచ్చళ్లలో ఉసిరి గింజల్నీ వేయండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇందుకోసం ఉసిరిగింజల్ని ఎండబెట్టండి. లేదా నూనె లేదా నెయ్యిలో వేయించండి. ఈ గింజలు మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వంటి పదార్థాలతో గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ స్పైసీ చట్నీని స్నాక్స్ తో డిప్ గా లేదా అన్నం, పప్పులతో సైడ్ డిష్ గా తినొచ్చు.
ఉసిరి గింజల్తో బేకింగ్
ఈ గింజల పొడిని బ్రెడ్, మఫిన్లు లేదా కేక్ పిండిలో కలపొచ్చు. ఇది మంచి టేస్ట్ వచ్చేలా చేస్తుంది. అలాగే పోషకాలను కూడా అందిస్తుంది. అలాగే ఈ గింజల్ని వేయించి కుకీలకు క్రంచ్ ను జోడించడానికి వీటిని టాపింగ్లుగా యూజ్ చేయొచ్చు.
ఉసిరి గింజల టీ
ఉసిరి గింజల్తో టీ ని తయారుచేసి తాగొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇందుకోసం ఉసిరికాయ గింజల్లో నీళ్లు, అల్లం, కొంచెం తేనె వేసి మరిగించండి. దాన్ని వడకట్టి వేడివేడిగా తాగండి. ఈ హెల్తీ టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
amla
ఊరగాయ
ఉసిరికాయ గింజలతో ఊరగాయను కూడా తయారుచేయొచ్చు. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందుకోసం నిమ్మకాయ లేదా మామిడి ఊరగాయ వంటి ఊరగాయల్లో ఉసిరిగింజలను వేయండి. ఈ గింజలను మసాలాలను, నూనెలను గ్రహిస్తాయి. అలాగే ఊరగాయను టేస్టీగా చేస్తాయి.