నవ యవ్వనంగా మెరిసిపోవాలా..? ఇదే బెస్ట్ ట్రిక్..!

First Published Jul 31, 2021, 12:22 PM IST

గ్రీన్ టీ తాగితే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. అదే గ్రీన్ టీ తో మరింత అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 

వయసు పెరుగుతుంటే ముఖం పై ముడతలు రావడం చాలా కామన్. వాటి వల్ల ముసలితనం స్పష్టంగా కనపడుతుంది. ముఖం నిర్జీవంగా మారుతుంది. కానీ.. అలా కాకుండా.. నిత్యం యవ్వనంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది కదా. మరి అలా కనిపించాలంటే వేలు ఖర్చు చేసి క్రీములు కొనాల్సిన పనిలేదు. చిన్ని చిట్కాలతో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined
గ్రీన్ టీ తాగితే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే.. అదే గ్రీన్ టీ తో మరింత అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

green tea

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా.. మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికీ, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి సహాయపడుతుంది.

green tea

గ్రీన్ టీలో షుగర్ కలిపితే.. బెస్ట్ ఫేస్ స్ర్కబ్ తయారు చేసుకోవచ్చట. దీని వల్ల డెడ్ స్కిన్ ని తొలగించుకోవచ్చు. దీనిని ఎలా చేసుకోవాలంటే.. ముందుగా గ్రీన్ టీ తయారు చేసుకోవాలి. అందులో.. రెండు టీస్పూన్ల షుగర్ యాడ్ చేయాలి. ఆ టీలో షుగర్ కరగకుండా చూసుకోవాలి. ఆ తర్వాత దానిని స్క్రబ్బర్ లా ముఖానికి మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

green tea

గ్రీన్ టీ మంచి స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది. ముఖం పై పేరుకున్న మురికి, దుమ్ము తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. గ్రీన్ టీ కాచి..చల్లారిన తర్వాత దానిని ఐస్ ట్రేలో పోసి.. దానిని గ్రీన్ టీ క్యూబ్స్ లా చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్ లను ముఖానికి రద్దుకుంటే.. ముఖం తాజాగా.. సహజ టోనర్ లా పనిచేస్తుంది.

green tea

ఎక్కువ నిద్రపోయినప్పుడు చాలా మంది కళ్లు కింద ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.దానిని తొలగించుకోవడడానికి కూడా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ బ్యాగ్ ని కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి.. ఆ తర్వాత కంటిపై పెట్టుకోవాలి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖం కడుపుకోవాలి. దీని వల్ల ఉపశమనం కలగడంతోపాటు.. ఆ ఉబ్బడం తగ్గుతుంది.

green tea

click me!