4. ఇక.. క్రమం తప్పకుండా మన చర్మానికి సన్ స్క్రీన్ రాస్తూ ఉండాలి. నేను బయటకు వెళ్లను.. నాకు ఎండ తగలదు.. సన్ స్క్రీన్ అవసరం ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ... సన్ స్క్రీన్ రాసుకుంటేనే మన చర్మం మంచిగా కనపడుతుంది. చర్మం డ్యామేజ్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. మీరు బయటకు వెళ్లిన ప్రతిసారీ సన్ స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి.
5.ఇక.. అందరి చర్మాలకు ఒకేలాంటి ఉత్పత్తులు సరిపడవు. మీ చర్మానికి సరిపోయే సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉండాలి. లేదంటే.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.