Silk Saree: పట్టుచీర కొత్తదానిలా మెరవాలంటే ఏం చేయాలి?

Published : Feb 22, 2025, 11:19 AM IST

పట్టుచీర ఎప్పుడూ కొత్తదానిలా కనిపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...    

PREV
16
Silk Saree:  పట్టుచీర కొత్తదానిలా మెరవాలంటే ఏం చేయాలి?

చీర నచ్చని స్త్రీలు ఎవరైనా ఉంటారా? అందులోనూ పట్టు చీర లేదా జరీ చీర అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే.. ఈ చీరల్లో తాము మరింత అందంగా కనపడతాం అని వారు నమ్ముతారు.   కానీ పట్టు చీరలను భద్రంగా ఉంచడం, కొత్తగా ఉంచడం పెద్ద టాస్క్. సరిగ్గా చూసుకుంటే ఎన్నో ఏళ్లయినా కొత్తగానే ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో పట్టు చీరలను కొత్తగా ఎలా చూసుకోవాలో చిట్కాలు చూద్దాం

26

జరీ చీరలను భద్రపరిచే టెక్నిక్:మీరు పట్టు చీరలను రోజూ కట్టుకోరు. కేవలం ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కట్టుకుంటారు. దానికోసం వాటిని బీరువాల్లో భద్రపరుస్తూ ఉంటారు. అయితే.. అవి ఎప్పటికీ కొత్తగా ఉండాలంటే, వాటిని నెలల తరబడి ఒకే చోట అలా ఉంచకూడదు. దాదాపు 3 నుంచి 6 నెలలకోసారి దాన్ని బీరువా నుంచి తీసి గాలి తగిలేలా చేయడం అవసరం. ఇంట్లో నీడలో ఆరబెట్టడం వల్ల అవి తేమగా ఉండవు. ప్రత్యేకంగా వాటిని మళ్లీ మడత పెట్టి పాత మడతలను మార్చి పెట్టాలి. 

36

కాటన్ బ్యాగ్:మీరు చీరను మడత పెట్టి అలాగే బీరువాలో పెడితే అది త్వరగా పాడైపోవచ్చు. ప్లాస్టిక్ స్టోరేజ్ కవర్‌లో పెట్టినా అది చీరను పాడు చేస్తుంది. ఎక్కువ కాలం పట్టు చీరను కొత్తగా ఉంచాలంటే మల్ మల్ బ్యాగ్ లేదా కాటన్ బ్యాగ్‌లో వేసి ఉంచండి. 

46

నాఫ్తలీన్ ఉండలు వద్దు:బీరువాలో పురుగులు రాకుండా ఆపడానికి, సువాసన కోసం నాఫ్తలీన్ ఉండలు కొని పెడతాం.  సిల్క్ చీర పెట్టేటప్పుడు అందులో సువాసన కోసం పెట్టే నాఫ్తలీన్ ఉండలు, పర్ఫ్యూమ్ కవర్లను అవాయిడ్ చేయాలి. ఇవి చీరను పాడు చేయవచ్చు. 

 

56

'నో' పర్ఫ్యూమ్:మనం బయటకు వెళ్లేటప్పుడు సువాసనగా ఉండాలని పర్ఫ్యూమ్ వేసుకుంటాం. చాలా సేపు ఆ సువాసన ఉండాలని డ్రెస్సు మీద విపరీతంగా కొట్టుకునే వాళ్లు కూడా ఉన్నారు.  సిల్క్ చీరలు కట్టుకునేటప్పుడు ఈ తప్పు చేయకూడదు. చీరకు దగ్గరలో స్ప్రే చేయకుండా దూరంగా నిలబడి కొట్టడం మంచిది. మీ చీరలో స్ప్రే చేయకుండా మోచేయి మడిచే భాగంలో, మెడకు కొడితే చాలా సేపు సువాసన ఉంటుంది.  చీరలో రసాయనాలతో కలిసిన పర్ఫ్యూమ్ పడితే అది పాడవుతుంది. 

 

66

ఎలా పెట్టాలి?: మిగతా చీరలతో పాటు పట్టు చీరలను ఒకదాని మీద ఒకటి కలిపి పేర్చి పెట్టాలి. సిల్క్ చీరల కోసమే ఒక స్థలాన్ని కేటాయించి అందులో పెట్టండి. కొంచెం ఖాళీగా ఉండేలా పెట్టడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories