Face Glow: ముఖంలో గ్లో పెరగాలా? శెనగపిండిలో ఇది కలిపి రాస్తే చాలు

Published : Feb 22, 2025, 10:14 AM IST

నిజానికి మన ముఖంలో గ్లో పెంచడంలో, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో, బ్లాక్ హెడ్స్ లాంటివి తొలగించడంలోనూ శెనగపిండి చాలా బాగా సహాయపడుతుంది. 

PREV
15
Face Glow: ముఖంలో గ్లో పెరగాలా? శెనగపిండిలో ఇది కలిపి రాస్తే చాలు
skincare

తమ ముఖం ఎప్పుడూ అందంగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసమే వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ, పూర్వం మన పెద్దవాళ్లు కేవలం పాలు, శెనగపిండి లాంటివి మాత్రమే ముఖానికి రాసుకునేవారు. మనం కూడా వాటిని ప్రయత్నించవచ్చు. నిజానికి మన ముఖంలో గ్లో పెంచడంలో, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో, బ్లాక్ హెడ్స్ లాంటివి తొలగించడంలోనూ శెనగపిండి చాలా బాగా సహాయపడుతుంది. మరి, శెనగపిండిలో ఏం కలిపి ముఖానికి రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం....
 

25

ఆయిల్ స్కిన్..
మీది ఆయిల్ స్కిన్ అయితే.. ముఖానికి శెనగపిండి ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల ముఖంపై అదనపు నూనెలు తొలగిపోతాయి. ముఖం తాజాగా, అందంగా కనపడటానికి సహాయపడుతుంది. చర్మం మృదువుగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. 
 

35
besan face packs

చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది
శనగపిండి చర్మ రంధ్రాలలోకి లోతుగా చొచ్చుకుపోయి లోపలి నుంచి శుభ్రం చేస్తుంది.   ఇది రోజంతా రంధ్రాలలో పేరుకుపోయే అదనపు మురికి, ధూళి , నూనెను సమర్థవంతంగా తొలగిస్తుంది. రెగ్యులర్ గా ముఖానికి శెనగపిండి రాయడం వల్ల  మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

45

వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. 
శెనగపిండిలో  విటమిన్ సి , జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది, ఇది క్రియాశీల యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది, ఇది మన చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల  ముఖం యవ్వనంగా కనిపించడంలో కనపడుతుంది.

55
Besan Face Pack

మీరు శెనగ పిండిలో పచ్చి పాలు, రోజ్ వాటర్ లాంటివి కలిపి ముఖానికి రాసుకోవచ్చు.  ఈ ప్యాక్‌ను 15-20 నిమిషాలు మాత్రమే అప్లై చేయండి; రాత్రంతా అలాగే ఉంచడం వల్ల మీ చర్మం ఎండిపోతుంది. చాలా పొడి చర్మం ఉన్నవారు దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది.

click me!

Recommended Stories