వాసన
దుర్వాసన అనేది ప్రతి స్త్రీ ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి. యోని నుండి రక్తం బయటకు వచ్చినప్పుడు, అది బ్యాక్టీరియా, శ్లేష్మం, వివిధ శరీర ద్రవాలతో కలిసిపోతుంది. ఎక్కువసేపు ప్యాడ్ ఉంచుకోవడం వల్ల అది తడిగా, కుళ్ళిన వాసనకు దారి తీస్తుంది. తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో దద్దుర్లు వస్తాయి. ఎక్కువ సేపు శానిటరీ నాప్‌కిన్ ధరించడం వల్ల రక్తంతో పాటు వెలువడే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.
రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ప్యాడ్స్ మారుస్తూ ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. రక్తస్రావం ఎక్కువగా అవ్వకపోయినా సరే… ప్రతి 3-4 గంటలకు ప్యాడ్ లు మారుస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా మార్చడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోకుండా, దుర్వాసన రాకుండా చేస్తుంది. మీకు ఎక్కువ ప్రవాహం ఉంటే, మీరు లీక్ కాకుండా చూసుకోవడానికి ప్యాడ్‌లను తరచుగా మార్చాల్సి ఉంటుంది.