ప్రస్తుతం ఏ నోట విన్నా అంబానీ ఇంటి పెళ్లి తంతు గురించే వినపడుతోంది. అంగరంగ వైభవంగా, ఆకాశాన్ని తాకేలా పందిళ్లు వేసి మరీ.... ముకేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ వివాహ వేడుకను జరిపించారు. మెహందీ, సంగీత్, దాండియా నైట్ ఇలా ఒక్కో వేడుక ఒక్కో రకంగా తీర్చి దిద్దారు. దేశంలోని ప్రముఖ సెలబ్రెటీలు మొత్తం ఈ పెళ్లికి క్యూలు కట్టారు. ఆల్రెడీ జులై 12వ తేదీన పెళ్లి జరగగా.... రిసెప్షన్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.