చెవి కమ్మలు, నెక్లెస్, ముక్కుపుడక, ఉంగరం.. నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jul 12, 2024, 3:54 PM IST

ఆడవాళ్లలకు బంగారు నగలంటే పిచ్చి. పెళ్లిళ్లు, పేరంటాలు అయితే ఇంట్లో ఉన్న నగలన్నీ.. అందంగా ఒంటికి అలంకరించుకుంటారు. మనలో ప్రతి ఒక్కరూ బంగారు నగలు కేవలం అందానికి  మాత్రమే అనకుంటారు. కానీ అలా అస్సలు కాదు.
 

బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కొంతమంది వీటిని ఆస్తిలా భావిస్తే.. మరికొంతమంది కేవలం వీటిని ఆభరణాల్లాగే భావిస్తారు. ఏదేమైనా మగవారితో పోలిస్తే ఆడవాళ్లే రకరకాల బంగారు ఆభరణాలను ధరిస్తారు. తాళి బొట్టు నుంచి నడుము వడ్డానం, లాంగ్ చెయిన్, నెక్ లేస్, చెవి కమ్మలు, ముక్కు పుడక, బంగారు గాజులు ఇలా.. బంగారం, వెండితో ఎన్నో నగలను చేయించుకుంటారు. ఇన్ని రకాల నగలను చేయించుకున్నా పెళ్లిళ్లు, పేరంటాలకు తప్ప మిగతా టైం లో వీటిని అస్సలు బయటకే తీయరు. అయితే ఆడవాళ్లు వివిధ రకాల ఆభరణాలను ధరించడం వెనుక ఒక ముఖ్యమైన శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. ఈ ఆభరణాలు ధరించడం వల్ల కొన్ని శరీర అవయవాలపై వీటి ఒత్తిడి పడి వాటికి మేలు చేస్తుంది. అసలు ఆడవాళ్లు ధరించే బంగారు  ఆభరణాల వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

చెవి పోగులు

చెవి కమ్మల్లో ఎన్నో డిజైన్స్ ఉంటాయి. ఎవరికి నచ్చినవి వాళ్లు చేయించుకుంటారు. ఒక్కొక్కరికి అయితే ఐదారు జతల కమ్మలు కూడా ఉంటాయి. ఈ సంగతి పక్కన పెడితే చెవిపోగులను సాధారణంగా ఆడవాళ్లు, మగవాళ్లు  ఇద్దరూ పెట్టుకుంటారు. వీటిని ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే మెదడు పనితీరు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
 


ఉంగరం 

ఉంగరం ఆడవాళ్లే కాదు.. మగవారు కూడా ధరిస్తారు. కొంతమంది అయితే ఉన్న ఐదు వేళ్లకు కూడా ఉంగరాలను పెట్టుకుంటుంటారు. అయితే ఉంగరాలను ధరించడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయట. ఎందుకంటే ఉంగరం వేళు జననేంద్రియాలను ప్రేరేపించే పాయింట్లను కలిగి ఉంటుంది.
 

గాజులు

పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా బంగారు గాజులను వేసుకుంటారు. ఈ గాజులు కేవలం అందానికే కాదు.. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయంటున్నారు నిపుణులు. అవును ఈ గాజుల వల్ల  ముంజేయి ప్రాంతంలో ఒత్తిడి పడుతుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

నెక్ లెస్

థాళి గొలుసు, నెక్లెస్ వంటి మెడకు వేసుకునే ఆభరణాలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఇవి శరీరం, తల మధ్య శక్తి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. దీంతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
 

మెట్టెలు

పెళ్లైన ఆడవారు వెండి మెట్టెలను పెట్టుకుంటారు. కేవలం మెట్టెలు సంప్రదాయానికే కాదు.. ఆడవాళ్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. గర్భాశయం సిర బొటనవేళి పక్కన వేళి వద్ద ముగుస్తుంది. ఇక్కడ మెట్టె చేైసే ఒత్తిడి గర్భాశయాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే సెక్స్ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అందుకే మెట్టెలను బొటన వేళి పక్కన వేలికి ధరిస్తారు.
 

ముక్కు పుడక 

పెళ్లైన వారే కాదు పెళ్లికాని అమ్మాయిలు కూడా ముక్కు పుడకలను ఖచ్చితంగా పెట్టుకుంటారు. ముక్కు పుడక పెట్టుకునే ప్రదేశంలో పెద్దప్రేగు, చిన్న ప్రేగు మధ్య సంబంధం ఉంటుంది. ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల ఇవి ఉత్తేజపడతాయి. దీంతో పేగు వ్యాధులు నయమవుతాయి. అలాగే ఇది ప్రసవ నొప్పులను కూడా తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Latest Videos

click me!