బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి స్పెషల్ గా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఆమె తన సినిమాలతోనో.. లేదంటే ఏదైనా కాంట్రవర్సీలతోనో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ కాంట్రవర్సీల విషయం పక్కన పెడితే... కంగనా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందిే.
ఆమె సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తలో ఎంత అందంగా ఉందో.. ఇప్పుడు కూడా అంతే అందంగా కనపడుతుంది. ఆమె ఎంచుకునే సినిమాలు సైతం చాలా భిన్నంగా.. ఎవరినైనా ఆకట్టుకునేలా ఉంటాయి.
కాగా.. కంగనా లో ఆమె జట్టు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అందరికన్నా ఆమె జుట్టు భిన్నంగా ఉంటుంది. ఉంగరాల జట్టుతో అందంగా కనిపించడం అంత సులవైన విషయం కాదు. అయితే.. ఆమె తన ఉంగరాల జుట్టుని మరింత అందంగా చేసుకొని.. తన అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది.
తన జట్టు విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. తన జట్టుని క్రమం తప్పకుండా ఆమె ఆయిల్ రాస్తూ ఉంటారట. ఆయిల్ రాయడం వల్లనే తన జట్టు అంత అందంగా ఉందని ఆమె చెబుతున్నారు.
అయితే.. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ ఆమె రాయరట. కేవలం హిమాలయాల్లో మాత్రమే లభించే ఆయిల్ మాత్రమే రాసుకుంటారట. ఆ నూనె ప్రత్యేకత ఏంటో ఓసారి చూద్దాం.. తన జట్టు సంరక్షణ కోసం కంగనా.. ఆప్రికాట్ కెర్నాల్ ఆయిల్ ని వినియోగిస్తారట. ఆ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టిస్తారట.
ఈ ఆప్రికాట్ ఆయిల్.. బయట మార్కెట్లో లభించదట. దానిని ఆమె హిమాయల పర్వతాల వద్ద నుంచి స్పెషల్ గా తెప్పించుకుంటుందట. ఈ నూనెను ఆప్రికాట్స్ నుంచి తయారు చేస్తారట.
ఈ నూనె రాయడం వల్ల జట్టు ఒత్తుగా పెరగడంతోపాటు.. కుదుళ్లను బలపరుస్తుందట. ఈ నూనె రాయడం వల్ల.. ఆమె చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదట. జట్టు ఒత్తుగా పెరుగుతూ.. వెంట్రుకలు ధ్రుడంగా ఉండాలంటే.. అంతేకాకుండా.. మెరుస్తూ కనిపించాలంటే.. కచ్చితంగా ఈ నూనె వాడాలని ఆమె చెబుతోంది.