ఇలా మాత్రం ఇంటిని తుడవకూడదు.. లేదంటే టైల్స్ దెబ్బతింటయ్

First Published | Oct 14, 2024, 10:02 AM IST

చాలా మంది ప్రతిరోజూ ఇంటిని తుడుస్తుంటారు. కొంతమంది మాత్రం రెండు మూడు రోజులకోసారి క్లీన్ చేస్తుంటారు. అయితే  మీరు ఫ్లోర్ ను తుడిచేటప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల టైల్స్, బండలు పాతగానే కనిపిస్తాయి. తుడిచినట్టుగా కూడా ఉండదు. 

ఇంటిని అందంగా, చూడచక్కగా ఉంచుకోవాలని ఆడవాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే రకరకాల డెకరేషన్ వస్తువులను కూడా ఇంట్లో పెడుతుంటారు. అంతేకాదు ప్రతిరోజూ ఉదయం, ఉదయం సాయంత్రం వేళ ఇంటిని ఉడిచి, తుడుస్తుంటారు.

అయితే కొంతమంది ఇంటిని తుడిచినా.. తుడవనట్టుగానే కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని చాలా సార్లు డౌట్ వస్తుంటుంది. అయితే క్లీన్ టైంలో మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్లే ఇలా జరుగుతుంది.

అందుకే క్లీనింగ్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు? ఫ్లోర్ కొత్తదానిలా మెరవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

ఫ్లోర్ ను శుభ్రం చేయడానికి మోపింగ్ గురించే ఆలోచిస్తాం. ఇందుకోసం సాధారణంగా మనమందరం నేలపై మురికి కనిపిస్తేనే తుడుస్తుంటారు. కానీ ప్రతిదాన్ని తుడుచుకోవడం వల్ల క్రమంగా ఫ్లోర్ మెరుపు తగ్గుతుందని మాత్రం ఆలోచించం.

అంతేకాకుండా.. ఇంటిని క్లీన్ చేసే సమయంలో నీటిని మారవడం కూడా చాలా అవసరం. మురికి నీటిని ఉపయోగిస్తే.. ఫ్లోర్ పై దుమ్ము, ధూళి వ్యాప్తి చెందుతుంది. కానీ ఫ్లోర్ కు ఉన్న దుమ్ము మాత్రం పోదు. అందుకే మోపింగ్ చేసేటప్పుడు శుభ్రమైన నీళ్లను మాత్రమే ఉపయోగించండి. అప్పుడే మీ ఫ్లోర్ మెరుస్తుంది. 

రాంగ్ ఫ్లోర్ క్లీనర్ ను ఉపయోగించడం

ప్రతి ఒక్కరూ ఫ్లోర్ ను క్లీన్ చేయడానికి రకరకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్లోర్ పై పడిన మరకలను పోగొట్టడానికి సరైన క్లీనింగ్ ప్రొడక్ట్స్ ను మాత్రమే వాడాలి. ఏమీ తెలుసుకోకుండా.. మీరు ఏది పడితే ఆ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తే.. ఫ్లోర్ దెబ్బతింటుంది.

ఎందుకంటే చాలా రకాల క్లీనింగ్ ఫోర్లలో కఠినమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఫ్లోర్ ను దెబ్బతీస్తాయి. అలాగే పెయింట్ లేదా కొన్ని రకాల ఫ్లోరింగ్ లపై మరకలు అయ్యేలా చేస్తాయి. 


క్లీనింగ్ కోసం మురికి బట్టలు, ఎక్విప్ మెంట్ ను ఉపయోగించడం

చాలా మంది ఆడవారు మురికి, పాత బట్టలను ఇంటిని తుడవడానికి ఉపయోగిస్తారు. అలాగే ఫ్లోర్ స్క్రబ్బర్లు, మాప్స్, చీపుర్లు, బ్రష్ లు, దుస్తులు వంటి వాటిని కూడా ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఉపయోగిస్తుంటారు.

అయితే ఫ్లోర్ క్లీనింగ్ కోసం పొరపాటున కూడా మురికి దుస్తులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి ఫ్లోర్ కు అంటిని మురికిని వదిలించడానికి బదులుగా దానికున్న మురికిని, దుమ్మును, దుళిని ఫ్లోర్ కు అంటేలా చేస్తాయి. 

మొండి మరకలను మరకలను తొలగించడానికి

ఫ్లోర్ కు అంటిని మరకలను పోగొట్టడానికి.. చాలా మంది క్లీన్ చేసే ద్రావణాలను ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే క్లీనింగ్ ప్రొడక్ట్ లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి.

ఇవి మీ ఫ్లోర్ ను దెబ్బతీస్తాయి. షైనింగ్ ను పోగొడుతాయి. అందుకే క్లీనర్ ను నేరుగా ఫ్లోర్ పై పోసే ముందు దానిపై ఉన్న నోట్ ను ఖచ్చితంగా చదవండి. 
 

ఫ్లోర్ ను క్లీన్ చేయడానికి వీటిని కూడా ఉపయోగించొచ్చు

ఆల్కహాల్

అవును ఫ్లోర్ ను క్లీన్ చేయడానికి మీరు మందును కూడా ఉపయోగించొచ్చు. నిజానికి ఆల్కహాల్ సహజ క్రిమిసంహారక మందు. అలాగే ఇది నేలపై ఉన్న సూక్ష్మక్రిములను చంపుతుంది. ఫ్లోర్ కు అంటుకున్న దుమ్మును, ధూళిని, జిడ్డును తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

ఆల్కహాల్ తో జస్ట్ కొన్ని నిమిషాల్లోనే మురికిని తుడిచేయొచ్చు.ఈ క్లీనర్ ను తయారు చేయడానిక ఒక గిన్నెలో ఆల్కహాల్, నీటిని మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో పోయండి. అయితే ఈ ఆల్కహాల్ వాసన రాకూడదంటే వెనిగర్ లేదా సువాసన వచ్చే నూనెలను ఈ నీళ్లలో కొద్దిగా కలపండి. 

floor cleaning

వెనిగర్ తో క్లీనింగ్ 

వెనిగర్ లో ఉండే ఎసిటిక్ ఫ్లోర్ పై ఉన్న సూక్ష్మక్రిములను చంపుతుంది. అలాగే ఫ్లోర్ కు అంటుకున్న మురికిని వదిలిస్తుంది. చెక్క ఫ్లోర్ పై ఉన్న మరకలను శుభ్రం చేయడానికి మీరు దీన్ని ఉపయోగించొచ్చు.

ఇందుకోసం ఒక లీటరు సీసాలో సగం కంటే తక్కువ వెనిగర్ వేసి, అందులో నీటిని కలపండి. దీన్ని ఫ్లోర్ క్లీనర్ గా ఉపయోగించొచ్చు. 

బేకింగ్ సోడా, నిమ్మరసం 

బేకింగ్ సోడా, నిమ్మరసం ఉపయోగించి కూడా మీరు ఫ్లోర్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో బేకింగ్ సోడా, నిమ్మరసం కలపండి. దీన్ని ఫ్లోర్ క్లీనర్ గా ఉపయోగించండి. 

Latest Videos

click me!