పసుపు, నెయ్యి కలిపి ముఖానికి రాస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
పసుపులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కాలుష్యం, దుమ్ము, ధూళి నుంచి, సూర్య రశ్మి నుంచి కాపాడటంలో సహాయం చేస్తాయి. పసుపు లో ఉండే తేలికపాటి ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని కూడా తొలగిస్తాయి. ఇదే పసుపులో నెయ్యి కూడా కలపడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ముఖంపై పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ తొలగించడంలోనూ సహాయపడతాయి. మీ స్కిన్ టోన్ మంచిగా ఈవెన్ గా కనిపించేలా చేస్తుంది.అంతేకాదు.. వయసుతో పాటు వచ్చే ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా చేయడంలోనూ హెల్ప్ చేస్తాయి. దీంతో.. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మం డ్రై అవ్వగుండా, మంచిగా హైడ్రేటెడ్ గా ఉంచడంలోనూ సహాయం చేస్తాయి. చిన్న పిల్లల స్కిన్ లాగా మృదువుగా మారడం పక్కా. మొటిమల సమస్య అనేదే ఉండదు. దాని తాలుకా వచ్చే మచ్చలను కూడా తగ్గించేస్తాయి.