hair growth
ప్రతిఒక్క అమ్మాయి తన జుట్టు అందంగా, మందంగా, పొడుగ్గా ఉండాలని ఆశపడుతుంది. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా జుట్టు పెరగడానికి రకరకాల నూనెలను, షాంపూలను పెడుతుంటారు.
కానీ కెమికల్స్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా వాడితే జుట్టు దెబ్బతింటుంది. వెంట్రుకలు బాగా రాలుతాయి. అలాగే జుట్టు కూడా పొడిబారుతుంది. అందుకే జుట్టుకు నేచురల్ పద్దతులను ఫాలో అవ్వడం మంచిదంటారు నిపుణులు.
నిపుణుల ప్రకారం.. ఉడకబెట్టిన అన్నం జుట్టుకు ఎంతో ప్రయోనకరంగా ఉంటుంది. ఇవి మన జుట్టుకు మంచి పోషణను అందించి ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అన్నాన్ని ఉపయోగించి మన జుట్టును పొడుగ్గా, మందంగా, బలంగా పెరిగేలా చేయొచ్చు. అందుకే అన్నాన్ని మన జుట్టుకు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టు పెరగడానికి అన్నాన్ని ఎలా ఉపయోగించాలి?
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం ఒక కప్పు, మెంతులు, బీట్ రూట్ జ్యూస్, ఫ్రెష్ కలబంద జెల్ (1 పెద్ద గిన్నె)
జుట్టుకు అన్నాన్ని పెట్టడం వల్ల కలిపే ప్రయోజనాలు
ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇది మీ జుట్టును మెరిసేలా, స్ట్రాంగ్ గా మార్చడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
జుట్టు పెరగడానికి అన్నాన్ని కోసం ఏం చేయాలి?
మెంతులను ముందు రోజు రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఈ నానబెట్టిన మెంతులను, ఉడికించిన బియ్యాన్ని కలిపి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇందుకోసం మెంతులను నానబెట్టిన నీళ్లను వాడండి. దీంట్లోనే బీట్ రూట్ జ్యూస్, అలోవెరా జెల్ ను కూడా మిక్స్ చేయండి.
ఈ పదార్థాలన్నింటినీ కలిపి ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి మెహందీ హెయిర్ మాస్క్ లా దీన్ని అప్లై చేయండి. దీన్ని జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి.
ఆ తర్వాత శుభ్రమైన నీళ్లతో జుట్టును శుభ్రంగా కడగండి. అలాగే మర్చిపోకుండా కండీషనర్ ను సరిగ్గా ఉపయోగించండి. దీన్ని తరచుగా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ అందడంతో పాటుగా పొడుగ్గా కూడా పెరుగుతుంది.
గమనిక - ఏదేమైనా ఏదైనా రెసిపీని ప్రయత్నించే ముందు ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలి. ముఖ్యంగా ఖచ్చితంగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ ను చేయించాలి.
hair growth
ఉసిరికాయతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు
ఉసిరికాయ మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని హెయిర్ ఆయిల్ లో కూడా ఉపయోగించొచ్చు. ఈ హెయిర్ ఆయిల్ జుట్టు మూలాలను బలంగా చేస్తుంది.
ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇది జుట్టు తెల్లబడటాన్ని, జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫోలికల్స్ ను బలంగా చేస్తుంది. నెత్తిమీద రక్తప్రసరణను పెంచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది.
జుట్టు ఆరోగ్యం కోసం మీరు ఉదయం పరిగడుపున ఉసిరికాయను తేనెతో కలిపి తీసుకోవచ్చు. అలాగే ఉసిరికాయను నీళ్లు కలపకుండా జ్యూస్ చేసుకుని పరిగడుపున తాగొచ్చు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మీ జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.