ఈ ఒక్కటి షాంపూలో కలిపి పెడితే మీ జుట్టు పెరగడం పక్కా..

First Published | Oct 22, 2024, 2:45 PM IST

అబ్బాయిలైతే జుట్టు ఒత్తుగా ఉండాలనుకుంటే.. అమ్మాయిలు మాత్రం జుట్టు ఒత్తుగా ఉండటమే కాదు.. పొడుగ్గా పెరగాలని కోరుకుంటారు. అయితే పొట్టి జుట్టు ఉన్నవారు షాంపూలో ఒకటి కలిపి పెడితే ఖచ్చితంగా మీ వెంట్రుకలు పెరుగుతాయి.

అమ్మాయిలకు జుట్టే అందమంటారు. అందుకే అమ్మాయిలు జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. జుట్టు పెరగడానికని, రాలకుండా ఉండటానికని, పొడుగ్గా పెరగాలని రకరకాల షాంపూలను, నూనెలను మారుస్తూ ఉంటారు. అయినా జుట్టు పెరగని వారు ఎంతో మంది. 
 

జుట్టు పొడుగ్గా పెరగాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం, పోషకాల లోపం, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు బాగా రాలడంతో పాటుగా పల్చగా అవుతుంది. చుండ్రు కూడా ఏర్పడుతుంది.

చుండ్రు వల్ల వెంట్రుకలు విపరీతంగా రాలుతాయి. అయితే మీరు ఉపయోగించే షాంపూలో ఒకటి మిక్స్ చేసి తలస్నానం చేస్తే మీ జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే పొడుగ్గా పెరుగుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 



తేనె, షాంపూ

తేనె, షాంపూ వింతగా అనిపిస్తుంది కదూ. కానీ ఈ కాంబినేషన్ మన జుట్టుకు మంచి మేలు చేస్తుంది. తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. నెత్తికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు రెగ్యులర్ గా వాడే షాంపూలో సమాన పరిమాణంలో తేనె మిక్స్ చేసి తలకు రుద్దండి. తర్వాత కొద్ది సేపు  మసాజ్ చేసి నీళ్లతో కడిగేయండి. 

వారానికి రెండుసార్లు

తేనె, షాంపూను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు పొడుగ్గా పెరుగుతాయి. అయితే ఇందుకోసం వారానికి కనీసం రెండు సార్లై షాంపూలో తేనె మిక్స్ చేసి తలస్నానం చేయాలి. అప్పుడే మీరు కోరుకున్నట్టుగా జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 
 

తేనెలోని పోషకాలు 

తేనె ఆరోగ్యానికి, చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. తేనెలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ జుట్టు బాగా పెరగడానికి అన్ని విధాలా  దోహదపడతాయి. 

వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి

ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల నూనెలను, షాంపూలను ట్రై చేస్తుంటారు.

కానీ ఇలా షాంపూలో తేనెను మిక్స్ చేసి పెడితే వెంట్రుకలు రాలడం చాలా వరకు తగ్గుతుంది. తేనెలో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. 

ప్రకాశవంతమైన జుట్టు

చాలా మంది జుట్టు నిర్జీవంగా, డ్రైగా ఉంటుంది. ఏం చేసినా ఈ జుట్టు ఇలాగే ఉంటుందని అనుకుంటారు. కానీ తేనె ఈ సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. తేనె జుట్టుకు సహజ తేమను అందిస్తుంది. షాంపూలో తేనెను కలిపి పెట్టడం వల్ల మీ జుట్టు మంచి షైనీ వస్తుంది.

అలాగే మృదువుగా కనిపిస్తుంది. ఏదేమైనా.. డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే ఈ రెమెడీని ఫాలో అవ్వండి. మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే ఈ పద్ధతిని ఫాలో అవ్వకండి. 

Latest Videos

click me!