గుమ్మడికాయ గుజ్జు ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 22, 2024, 11:07 AM IST

గుమ్మడికాయ గుజ్జును ముఖానికి రాయడం వల్ల..  అందం పెరుగుతుందట. ముఖంపై ముడతలు తగ్గించడం దగ్గర నుంచి.. మీ వయసు తగ్గించుకోవచ్చట. అదెలాగో చూద్దాం..

pumpkin face pack

మనం తినే అన్ని కూరగాయల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రతి కూరగాయ మనకు అనేక ప్రయోజనాలను అందిస్తూనే ఉంటుంది. అలా పోషకాలు ఉన్న కాయగూరల్లో గుమ్మడికాయ కూడా ఒకటి. ఈ గుమ్మడికాయ లో ఉన్న పోషకాలు మనకు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా గుమ్మడికాయ గుజ్జును ముఖానికి రాయడం వల్ల..  అందం పెరుగుతుందట. ముఖంపై ముడతలు తగ్గించడం దగ్గర నుంచి.. మీ వయసు తగ్గించుకోవచ్చట. అదెలాగో చూద్దాం..

యంగ్ లుక్ తెచ్చే గుమ్మడికాయ ఫేస్ ప్యాక్…

గుమ్మడికాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ఐరన్ , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు గుమ్మడికాయలోని పోషకాలు ముఖంపై ముడతలు, గీతలు, నల్లమచ్చలను పోగొట్టి యవ్వనంగా కనిపించే చర్మాన్ని  పొందేందుకు సహకరిస్తాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని  ఫేస్ ప్యాకులను కూడా తయారు చేసుకుంటే సరిపోతుంది.


pumpkin face pack

గుమ్మడికాయ, తేనె:

గుమ్మడికాయను బాగా గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇందులోని పోషకాలు ముఖంపై ఉండే ముడతలు, గీతలు, నల్ల మచ్చలను పోగొట్టేందుకు సహకరిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్‌ని కనీసం వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది. మహిళలే కాదు పురుషులు కూడా ఈ బేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

గుమ్మడికాయ ,పెరుగు:

గుమ్మడికాయను బాగా గ్రైండ్ చేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, తేనె మిక్స్ చేసి బేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ బేస్ ప్యాక్ మొదట స్థిరంగా అప్లై చేసినప్పుడు ముఖం నుండి ముడతలు, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ,గుడ్లు:

మిక్సీ జార్‌లో గుమ్మడికాయ గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, తేనెను బాగా కలిపి బేస్ ప్యాక్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇందులోని పోషకాలు ముఖంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు సహకరిస్తాయి.

గుమ్మడికాయ, కాఫీ పొడి:

ఒక టీస్పూన్ గుమ్మడికాయ మిశ్రమానికి ఒక చెంచా కాఫీ పొడి, మూడు చెంచాల పెరుగు, అర చెంచా తేనె కలిపి బేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇవి ముడుతలను తొలగించి ముఖం కాంతివంతంగా మార్చేందుకు సహకరిస్తాయి.

Latest Videos

click me!