రాధికా మర్చంట్ మెహందీ అస్సలు నల్లగా మారదు.. సీక్రేట్ ఇదే.. !

First Published | Jul 13, 2024, 11:30 AM IST

అంబానీ వారి పెళ్లి సందడి అంబరాన్ని అంటింది. కుబేరిడి ఇంట్లో పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అయితే గత కొన్ని రోజుల నుంచి రాధికా మర్చంట్ కు సంబంధించిన పెళ్లి తంతు ఫోటోలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ ఫోటోల్లో రాధికా మర్చంట్ మెహందీ అదిరిపోయింది. ఇన్ని రోజులల్లో ఆమె మెహందీ మాత్రం అస్సలు నల్లగా మారలేదు. ఎందుకో తెలుసా? 
 

పెళ్లి జీవితంలో ఒకే సారి వస్తుంది. అందులోనూ ఇది చాలా పవిత్రమైన తంతు. ఎంతో స్పెషల్ సందర్భం కూడా. అందుకే పెళ్లి చేసుకునే ప్రతి అమ్మాయి పెళ్లిలో ఎంతో స్పెషల్ గా, అందరిలో డిఫరెంట్ గా కనిపించాలనుకుంటుంది. అందుకే పెళ్లికి ధరించే దుస్తులు, చెప్పులు, నగల నుంచి చేతులకు వేసుకునే మెహందీ డిజైన్ వరకు ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా ఉండేలా కేర్ తీసుకుంటుంది. సాధారణంగా పెళ్లికి ప్రతి ఒక్క అమ్మాయి రెండు చేతుల నిండా మెహందీ వేసుకుంటుంది. కానీ ఈ మొహందీ రెండు మూడు రోజుల్లోనే నల్లగా మారిపోతుంది.ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మెహందీ పోతుంది. ఇది అందరికీ తెలిసిందే. 
 

Modi Anant Ambani Radhika Merchant

కానీ అంబానీ వారి చిన్నకోడలు రాధికా మెహందీ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. రాధికా ఒక్కామెకే కాదు అంబానీ కుటుంబంలోని ప్రతి మహిళా అందంగా మెహందీని పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. నీతా అంబానీ మెహందీ గురించి చాలా చర్చే జరిగింది. కాగా కొత్త పెళ్లి కూతురు రాధికా మర్చంట్ మెహందీ డిజైన్ అదిరిపోయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ మెహందీ రంగులో ఏ మార్పులూ రాలేదు. అంటే ఇప్పుడు వేసిన డిజైన్ లాగే కనిపిస్తోంది. అసలు ఇది ఎలా సాధ్యం.. రాధికా మర్చంట్ ఇందుకోసం ఏం చేసిందో తెలుసుకుందాం పదండి. 

Latest Videos


మెహందీ రంగు రెడ్ గానే ఉండాలంటే ముందుగా పచ్చి ఆవనూనెను ఒక గిన్నెలోకి తీసుకోండి. దీనిలో కాటన్ బాల్ ను అందులో ముంచి మెహందీపై చేతులకు అప్లై చేయండి. అయితే చేతులకు మెహందీ పూర్తిగా ఆరిన తర్వాతే నూనెను అప్లై చేయాలి. మెహందీ కడిగేసిన తర్వాత కూడా ఆవనూనెను చేతులకు పెట్టాలి. 

మెహందీని ఆరబెట్టిన తర్వాత, దీన్ని కడిగేసిన తర్వాత చేతులకు ముందు, వెనుక భాగంలో బామ్ ను అప్లై చేయాలి. దీన్ని బాగా రుద్ది అలాగే కొద్దిసేపు వదిలేయండి.
 

ఊరగాయ నూనె వాడితే కూడా మెహందీ నల్లగా మారదని చాలా మంది చెప్తుంటారు. దీని కోసం గోరింటాకును చేతులకు పెట్టుకున్న తర్వాత దాన్ని పూర్తిగా ఆరనివ్వండి. అలాగే మెహందీని తొలగించడానికి నీటిని ఉపయోగించకండి. గోరింటాకు ఆరిన తర్వాత చేతులతో నెమ్మదిగా తొలగించండి. తర్వాత ఒక చెంచా ఊరగాయలో నూనె తీసుకుని రెండు చేతులకు బాగా పట్టించండి. దీనికి బదులుగా మీరు నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు.
 

ఇకపోతే రాధికా మర్చంట్ ఇప్పుడు అధికారికంగా అంబానీ వారి కోడలు అయిపోయింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12 న సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. అంబానీ చిన్న కొడుకు పెళ్లికి భారీ మొత్తంలో ఖర్చు పెట్టినట్టు సమాచారం. 

click me!