అంబానీ కొత్త కోడలు ధరించిన జ్యూవెలరీ.. కొత్తవి కావా..? వాళ్ల అక్క జ్యూవెలరీనా..?

First Published | Jul 13, 2024, 11:01 AM IST

ఇవే జ్యూవెలరీ నాలుగేళ్ల క్రితం రాధిక అక్క అను కూడా ధరించింది. ఇవి వారి ఫ్యామిలీ వారసత్వ జ్యూవెలరీ అంట. అందుకే.. వాటినే ఇప్పుడు రాధిక ధరించడం గమనార్హం.

అంబానీ ఇంట వివాహ వేడుక ముగిసింది. దేశ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ల వివాహం కన్నుల పండవలా ముగిసింది.  చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటూ.. తర్వాత ప్రేమ బంధంలోకి అడుగుపెట్టిన అనంత్- రాధికలు.. ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు.
 

ఈ జంటను  గత రాత్రి రాజకీయాలు, విననోదం, వ్యాపార ప్రపంచంలోని ప్రముఖులంతా.. హాజరై మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో రాధిక స్పెషల్ గా డిజైన్ చేసిన లెహంగా ధరించారు.  కస్టమ్ అబు జానీ సందీప్ ఖోస్లా లెహంగాను ధరించారు. ఆ లెహంగాతోపాటుు ఆమె ధరించిన జ్యూవెలరీ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఆ జ్యూవెలరీ రాధిక తన పెళ్లి కోసం స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నది కాదు. 2020లో తన సోదరి వివాహానికి ధరించిన సేమ్ జ్యూవెలరీనే ఇప్పుడు రాధిక కూడా ధరించడం  విశేషం. ఇవే జ్యూవెలరీ నాలుగేళ్ల క్రితం రాధిక అక్క అను కూడా ధరించింది. ఇవి వారి ఫ్యామిలీ వారసత్వ జ్యూవెలరీ అంట. అందుకే.. వాటినే ఇప్పుడు రాధిక ధరించడం గమనార్హం.
 


ఇప్పటికే.. అనంత్- రాధిక ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో  రాధిక మర్చంట్ తన వివాహానికి సంబంధించిన ఎరుపు,  తెలుపు రంగు లెహంగాను అనంత్ అంబానీతో మర్చంట్ కుటుంబంలో తరతరాలుగా వచ్చిన వారసత్వ ఆభరణాలతో జత చేసింది. రాధిక కంటే ముందు, ఆమె సోదరి, అంజలి మర్చంట్, 2020లో తన వివాహానికి ఆభరణాలను ధరించారు. 

వారి తల్లి , నాని కూడా వారి వివాహ వేడుకల కోసం ఆభరణాలను ధరించారు. వారు నూతన వధూవరులకు చోకర్‌ను అందజేశారు. రాధిక కూడా అంజలి  పోల్కీ చెవిపోగులు, మాంగ్ టికా , హాత్ ఫూల్ ధరించింది. ఇవి కాకుండా.. రాధిక అద్భుతమైన డైమండ్ , పచ్చ హారము, కధలు, కంకణాలు, కలీరాలను ధరించారు.
 

ఆ లెహంగా కూడా.. తమ వారసత్వానికి సూటయ్యేలా.. గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఈ లెహంగా డిజైన్ చేయించుకున్నారు. వెనక స్పెషల్ గా  ఎరుపు రంగు దుప్పట్టా కూడా ఉంది. 

జర్దోజీలు, సాది, నక్షి అన్నీ కలిపి మరీ డిజైన్ చేసిన డ్రెస్ అది. అందుకే.. ఆ స్పెషల్ డిజైనర్ లెహంగాలో రాధిక అందం మరింత రెట్టింపుగా మారింది. మేకప్ సైతం చాలా సింపుల్ గా, హెవీగా లేకుండా.. ఆకట్టుకునేలా ముస్తాబవ్వడం విశేషం. 

Latest Videos

click me!