అప్పటికప్పుడు అందంగా మెరిసిపోవాలా..? ఇవి ట్రై చేయండి..!

First Published | Aug 1, 2024, 12:40 PM IST

మనం మన ఇంట్లో లభించే కొన్ని ఉత్పత్తులను ముఖానికి అప్లై చేయడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు,

glowing skin

ఏదైనా పార్టీ, ఫంక్షన్  సమయంలోనే అందరి కంటే తాము  అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.  కానీ... అప్పటికప్పుడు ఫేస్ గ్లోగా, కళగా కనిపించాలి అంటే.. పార్లర్ కి వెళ్లక తప్పదు. కానీ.. ఒఖ్కసారి పార్లర్ కి వెళ్లాం అంటే... డబ్బులన్నీ ఖర్చు అవ్వాల్సిందే. మరి... డబ్బులు ఖర్చు కాకుండా.. ఇంట్లోనే అప్పటికప్పుడు అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసా..? ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే. 

మనం మన ఇంట్లో లభించే కొన్ని ఉత్పత్తులను ముఖానికి అప్లై చేయడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు,

దానికోసం మనం ముందుగా నారింజ తొక్కల పొడిని తీసుకోవాలి. దానిలో కొద్దిగా పచ్చి పాలు వేసి.. మందపాటి పేస్టులాగా మార్చుకోవాలి.  ఇప్పుడు ముఖాన్ని నీటితో కడుక్కొని.. తుడుచుకున్న తర్వాత.. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాలు వదిలేసి.. కొద్దిగా నీరు పోసి... స్క్రబ్ మాదిరాగా చేయాలి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల.. ముఖం మీద డెడ్ సెల్స్ అన్నీ పోతాయి. ముఖానికి మంచి గ్లో తెస్తుంది.
 

Latest Videos


దీని తర్వాత...  అవకాడో పేస్టు చేసుకొని.. అందులో తేనె, కోడిగుడ్డు తెల్ల సొన వేసిబాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని.. ముఖానికి మంచి మాస్క్ లాగా వేయాలి. ఈ మాస్క్ ని 20 నిమిషాల పాటు ఉంచుకొని శుభ్రం చేసుకోవాలి. ఫేస్ కి మంచి గ్లో తెచ్చి పెడుతుంది. లేదు.. మీకు ముఖంపై మొటిమలు ఉన్నాయన్నా.. లేదంటే.. మీది  ఆయిల్ స్కిన్ అయినా అఅయితే...  లవంగం పేస్సటు లేదా.. పుదీనా కర్పూర్ పుల్లర్స్ ఎర్త్ మిశ్రమాన్ని ప్రయత్నించవచ్చు. తక్షణ ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే.. మీరు ఓట్స్ లో కొంచెం పాలు పోసి నాననిచ్చి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. పది నిమిషాల తర్వాత కడిగేసినా.. మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖం అందంగా మెరిసిపోతుంది.  చాలా తక్కువ సమయంలో ఫేషియల్ లాంటి గ్లో మీకు లభిస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.

అయితే... ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు అందంగా కనిపించడం కాకుండా... ఎప్పుడూ అందంగా ఉండాలి అంటే.. ఈ కింది అలవాట్లను అలవరుచుకోవాలి. అవి కూడా ఏంటో చూసేద్దాం..
 

1.హైడ్రేషన్.. అందం గా కనిపించాలంటే ముందు మన చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలి.  దాని కోసం సీజన్ తో సంబంధం లేకుండా నీరు తాగాలి. అంటే.. కొబ్బరి నీరు, జ్యూస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు.  కానీ కచ్చితంగా ఒక రోజులో ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. ఇది.. మన శరీరక పనితీరులో మెరుగుపరచడానికి, జీవక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది.

2.ఆహారం... మనం అందంగా ఉండటం అనేది మనం తీసుకునే ఆహారం పై కూడా ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో కాదు.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కూడా తెలుసుకోవాలి. షుగర్ , ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలి.  ఎక్కువగా వేయించిన ఆహారాలు తీసుకోకూడదు.  దీని వల్ల బరువు పెరగడం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చి చర్మం పాడైపోతుంది అని నిపుణులు చెబుతున్నారు.

3. హెల్దీ డ్రింక్స్, ఫుడ్స్... కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఫుడ్స్, డ్రింక్స్ మన డైట్ లో భాగం చేసుకుంటే.. సహజంగానే అందంగా మెరిసిపోతామట.
కుంకుమపువ్వు నీరు: కొన్ని కుంకుమపువ్వులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే త్రాగాలి. కుంకుమపువ్వులోని విటమిన్లు , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మీ చర్మాన్ని అందంగా మార్చేస్తాయి.

amla shot

ఉసిరికాయ షాట్: తురిమిన రెండు ఉసిరికాయల నుండి రసాన్ని పిండండి. యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ షాట్ టాక్సిన్స్‌ను బయటకు పంపి, మీ చర్మాన్ని తాజాగా , మెరుస్తూ ఉంటుంది.

గింజలు: ప్రతిరోజూ కొన్ని గింజలు మీ చర్మానికి అద్భుతాలు చేస్తాయి, వాటి ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలకు ధన్యవాదాలు. ఈ పోషకాలు జీవక్రియను నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.

సిట్రస్ పండ్లు: మీ ఆహారంలో నిమ్మ, నారింజ , ఇతర సిట్రస్ పండ్లను చేర్చండి. యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్లతో ప్యాక్ చేయబడి, అవి మలినాలను తొలగించి, చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

గుమ్మడి గంజలు..  పోషకాల పవర్ హౌస్ అయిన గుమ్మడి గింజలను మీరు రెగ్యులలర్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు.. అందాన్ని కూడా పెంచుతాయి.
 

click me!