ఈ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ నూనె వల్ల మన జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిపుణుల ప్రకారం.. వారానికి రెండుసార్లు ఈ నూనెను జుట్టుకు పెట్టడం వల్ల మీ జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే జుట్టు మూలాలు బలంగా అవుతాయి. నెత్తిమీదున్న చుండ్రు కూడా పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ నూనె జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
ఈ నూనె క్రమం తప్పకుండా పెడితే.. మీరు నాలుగు వారాల్లోనే తేడా గమనిస్తారు. అంటే జుట్టు పొడవు, సాంద్రతలో చాలా పెరుగుదల మీకు కనిపిస్తుంది. అయితే మీ జుట్టును సరిగ్గా నిర్వహించడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. ఏదేమైనా ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది.