పచ్చి పాలు:
మన చర్మానికి పచ్చి పాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎలా అంటే పచ్చి పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకుని దాంట్లో కాటన్ బాల్ ను ముంచండి. దీనితో మీ ముఖాన్ని బాగా తుడవండి. కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని కడగండి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె కూడా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో కొబ్బరి నూనె మీ ముఖాన్ని తేమగా, కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రాత్రిపూట పడుకునే ముందు 2-3 చుక్కల కొబ్బరి నూనెను అరచేతికి రుద్ది ముఖానికి పెట్టండి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ముఖాన్ని కడిగేస్తే సరిపోతుంది.