ఇవి తింటే తెల్ల జుట్టు రానే రాదు..!

First Published | Jan 10, 2025, 2:24 PM IST

 కొన్ని రకాల ఫుడ్స్ ని రెగ్యులర్ గా తినడం వల్ల  జుట్టు బలంగా మారడమే కాదు... తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. మరి..  దాని కోసం మనం ఏం తినాలో ఇప్పుడు చూద్దాం....

మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం.  ఖరీదైన హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడేస్తూ ఉంటాం. ఇక.. తెల్ల జుట్టు రావడం మొదలైంది అంటే చాలు.. దానిని కవర్ చేయడానికి రకరకాల రంగులు, హెన్నాలు ప్రయత్నిస్తూ ఉంటారు. అవేమీ అక్కర్లేదు. కేవలం.. మనం మన ం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు.  కొన్ని రకాల ఫుడ్స్ ని రెగ్యులర్ గా తినడం వల్ల  జుట్టు బలంగా మారడమే కాదు... తెల్ల జుట్టు కూడా రాకుండా ఉంటుంది. మరి..  దాని కోసం మనం ఏం తినాలో ఇప్పుడు చూద్దాం....

copper

మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ప్రోటీన్, జింక్, బయోటిన్ వంటి పోషకాలు కచ్చితంగా తీసుకోవాలి. అయితే.. వీటితో పాటు కచ్చితంగా తీసుకోవాల్సిన మరో పోషకం కాపర్. మన శరీరంలో కాపర్  లోపం  వల్ల జుట్టు ఎక్కువగా బూడిద రంగులోకి మారిపోతుంది.  అందుకే.. రెగ్యులర్ గా కాపర్ తీసుకోవడం వల్ల... జుట్టు పొడవుగా మారడంతో పాటు... నల్లగా నిగనిగలాడుతుంది. మరి.. కాపర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏంటో చూద్దాం...



1. ఆకుకూరలు: పాలకూర  వంటి ఆకుకూరలు తినడం వల్ల మీ శరీరం లో కాపర్  స్థాయిలు పెరుగుతాయి. ఈ ఆహారాలు పోషకాలతో నిండినందున మీ మొత్తం ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.

2. గింజలు , విత్తనాలు: మీరు ప్రతిరోజూ గింజలు, విత్తనాలను, ముఖ్యంగా పొద్దుతిరుగుడు విత్తనాలు , జీడిపప్పులను తింటే, అది మీ శరీరానికి అవసరం అయ్యే కాపర్ ని అందిస్తుంది.
 

Lentils

3. తృణధాన్యాలు: క్వినోవా,  బార్లీ వంటి తృణధాన్యాలు తీసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.ఎందుకంటే రెండు ధాన్యాలు కాపర్ తో నిండి ఉంటాయి.

4. కాయధాన్యాలు , చిక్‌పీస్: పప్పులు , చిక్‌పీస్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో  కాపర్  స్థాయిలు మెరుగుపడతాయి.  మీకు పోషకాహారాన్ని అందిస్తాయి. మీ ఆహారంలో కనీసం ఒక్కసారైనా వాటిని చేర్చుకోండి. అంతేకాకుండా, మీరు డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

click me!