జుట్టు ఒత్తుగా మార్చే.. ముఖాన్ని అందంగా మార్చే ఒకే ఒక్క నూనె..!

First Published | Jul 31, 2024, 4:16 PM IST

జుట్టుకు రాసిన తర్వాత.. తొందరగా వదిలించడం కష్టం అందుకే.. దానిని వాడటం మానేశారు.  కానీ.. ఈ ఆముదమే.. మన చాలా రకాల జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. 
 

ఎవరికైనా జుట్టే అందం. అందుకే.. ఆ జుట్టుు  ఊడిపోకుండా ఉండాలని..  తెల్లగా మారకుండా.. ఎక్కువ కాలం నల్లగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. దాని కోసం ఎవరికి తోచినది వారు చేసేస్తారు.  మార్కెట్లో దొరికే ప్రతి ఆయిల్ ప్రయత్నిస్తారు. అయితే... మనకు తెలిసిన, పూర్వకాలం మన అమ్మమ్మలు, అమ్మలు వాడిన ఒక నూనె వాడితే.. కచ్చితంగా మీ జుట్టు నల్లగా, ఒత్తుగా, అందంగా మారుతుందని మీకు తెలుసా? ఆ నూనె ఏంటి..? ఆ నూనెతో జుట్టు ఆరోగ్యం మాత్రమే కాకుండా.. ఇతర ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం...
 

జుట్టుకు రెగ్యులర్ గా ఆముదం రాయడం వల్ల... ఆ జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది. ఒకప్పుడు.. కచ్చితంగా అందరూ కొబ్బరి నూనెతో సమానంగా ఆముదం రాసేవారు. అయితే.. ఇది కాస్త మందంగా ఉండి.. జుట్టుకు రాసిన తర్వాత.. తొందరగా వదిలించడం కష్టం అందుకే.. దానిని వాడటం మానేశారు.  కానీ.. ఈ ఆముదమే.. మన చాలా రకాల జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. 


Image: Getty

జుట్టుకు రాయడమే కాదు.. చర్మానికి కూడా రాసుకోవచ్చు. దీనిని చర్మానికి రాసుకోవడం వల్ల మంచి మాయిశ్చరైజేషన్ లభిస్తుంది. చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది. డ్రై స్కిన్ సమస్యే ఉండదు.  అంతేకాదు.. ఎవరైనా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఆముదం రాయడం వల్ల చాలా తక్కువ సమయంలో తగ్గిపోతాయి. మచ్చలతో సహా తగ్గిపోతాయి.
 

జుట్టు కోసం అయినా, చర్మం కోసం అయినా.. ఆముదం ఎందుకు మంచిది అంటే.. దీనిలో కెమికల్స్ ఉండదు. పూర్తిగా సహజంగా ఉంటుంది. అంతేకాదు.. ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.  ఆముదం లో యాంటీ బాక్టీరియల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలు చర్మ వ్యాధులను అరికట్టడంలో సహాయపడతాయి. హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. మొత్తం చర్మం ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఆముదం జుట్టుకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం...

జుట్టు పెరుగుదల ఉద్దీపన: ఆముదం జుట్టు పెరుగుదలను చాలా బాగా ప్రోత్సహిస్తుంది. మీరు నమ్మరు గానీ.. నెలరోజులు వాడి చూస్తే మీకే తెలుస్తుంది. జుట్టు స్మూత్ గా మారుతుంది. జుట్టు పరిమాణం పెరుగుతుంది. స్కాల్ప్ కి మంచి పోషణ లభిస్తుంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.మెరుగైన జుట్టు ఆకృతి: ఆముదం నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు మృదుత్వం మరియు ప్రకాశాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది, అలాగే జుట్టు మందాన్ని పెంచుతుంది

castor oil


జుట్టు కోసం:

1. ఆముదం నూనెను స్కాల్ప్‌పై మసాజ్ చేయండి. ఒక గంట అలానే వదిలేసి... తర్వాత షాంపూ చేస్తే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మీరు కోరుకున్న జుట్టు మీకు లభిస్తుంది.

చర్మ సౌందర్యం కోసం.. 
1. కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనె తో కలిపి రాత్రిపడుకునే ముందు ముఖానికి రాయాలి. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
 

Latest Videos

click me!