న్యూ ఇయర్ పార్టీకి ఈ డ్రెస్సుల్లో మీరు సూపర్ గా ఉంటారు..

First Published | Dec 30, 2023, 10:56 AM IST

New Year 2024: రేపే న్యూ ఇయర్ పార్టీ చేసుకునేది. ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో పార్టీలను చేసుకుంటుంటారు. అయితే ఆఫీస్ లో న్యూ ఇయర్ పార్టీ చేస్తున్నట్టైతే.. మీరు ఈ ట్రెండీ డ్రెస్సులను వేసుకెళ్లండి. వీటిలో మీ లుక్ జస్ట్ వావ్ అనిపిస్తుంది. 

New Year 2024: న్యూ ఇయర్ పార్టీ ఏర్పాట్లు అయిపోయే ఉంటారు. ఒకటి రెండు రోజుల ముందే చాలా మంది ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఏర్పాట్లన్నీ ముందుగానే చేసేస్తుంటారు. చాలా ఆఫీసులు కూడా న్యూ ఇయర్ పార్టీలు చేసుకుంటాయి. ఇక పార్టీలంటే లుక్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలో అందంగా కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అందంగా కనిపించేందుకు అస్సలు కాంప్రమైజ్ కారు. అమ్మాయిలు ఈ న్యూ ఇయర్ పార్టీలో అందరిలో తామే అందంగా కనిపించేందుకు డ్రెస్ ప్లానింగ్ చేస్తుంటారు. కానీ ఏది వేసుకోవాలనేదినిమీద కొంతమందికి క్లారిటీ మిస్ అవుతుంది. అయితే కొన్ని ట్రెండీ డ్రెస్సులు ఈ న్యూ ఇయర్ పార్టీలో మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఈ సారి వాటిని ట్రై చేయండి. ఆ డ్రెస్సులేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

వైట్ ప్యాంట్స్ సూట్ 

న్యూ ఇయర్ పార్టీలో కాస్త ప్రొఫెషనల్ లుక్ క్రియేట్ చేసుకోవాలంటే వైట్ ప్యాంట్ సూట్ వేసుకోవడం చాలా ఉత్తమం. ఈ డ్రెస్సులో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఇలాంటి దుస్తులు మార్కెట్ లో చాలానే అందుబాటులో ఉంటాయి. ఆఫీస్ పార్టీలో మీరు పర్ఫెక్ట్ గా కనిపిస్తారు. దీనితో పెర్ల్ డిజైన్ చెవిపోగులు, బోల్డ్ మేకప్ తో లుక్ ను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు.

Latest Videos


Jump suit

జంప్ సూట్ 

కంఫర్టబుల్ గా కనిపించాలంటే పార్టీలో జంప్ సూట్ ను వేసుకోండి. వీటిలో ఎన్నో రకాల డిజైన్లు ఉంటాయి. మీకు నచ్చింది కొనొచ్చు. గోల్డెన్ కలర్ జంప్ సూట్ ను ధరించిన దియా మీర్జా ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా.. ఆఫీస్ పార్టీలో కూడా మీరు ఈ తరహా జంప్ సూట్ ను వేసుకోవచ్చు. మార్కెట్లో ఇవి రూ.500 నుంచి రూ.1000 వరకు దొరుకుతాయి. 
 

Image: Malaika AroraInstagram

పొడవాటి గౌను 

మీరు కొన్ని కొత్త ట్రెండ్ దుస్తులను ట్రై చేయాలనుకుంటే.. దీని కోసం మీరు లాంగ్ గౌన్ ను వేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు  ఇలాంటి వాటినే ఎక్కువగా వేసుకుంటున్నారు. దీన్ని మీరు పార్టీకి కూడా వేసుకెళ్లొచ్చు. స్టైలిష్ లుక్ కోసం దానితో పాటు నగలు, హీల్స్, సొగసైన ఓపెన్ హెయిర్ స్టైల్స్ ను ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మీరు డిఫరెంట్ గా, అందంగా కనిపిస్తారు.

click me!