రెడ్ నెట్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ చీర
మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చీరను కూడా రిసెప్షన్ పార్టీకి కట్టుకోవచ్చు. ముఖ్యంగా రెడ్ కలర్ సారీ మీ అందాన్ని మరింత పెంచుతుంది. ఈ చీర కాస్త బరువుగా కనిపిస్తుంది. కానీ కట్టుకున్న తర్వాత స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఈ చీర బాగా ట్రెండ్ అవుతోంది కూడా. దీనితో మీరు కట్ స్లీవ్స్ బ్లౌజ్ ను వేసుకోవచ్చు. ఈ రకం చీరను మార్కెట్లో రూ.500 నుంచి రూ.1000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ చీరతో నిగనిగలాడే మేకప్ లుక్, ఓపెన్ హెయిర్ స్టైల్ లో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు.