ఈ రోజుల్లో ఏ కంపెనీ అయినా.. ఏదైనా వస్తువును మార్కెట్లోకి విడుదల చేయాలి అనుకుంటే.. దానికి కచ్చితంగా ప్రచారం కావాల్సిందే. టీవీల్లో, పేపర్స్, సోషల్ మీడియా.. ఇలా పలు రకాల మార్గాల ద్వారా.. ప్రకటనలు చేసి.. ప్రజలకు ఆ వస్తువను పరిచం చేస్తుంటారు. ఇప్పుడు ప్రజలు వాడే దాదాపు అన్ని వస్తువులు.. ప్రకటనల ద్వారానే చేరువైనవే. కాబట్టి.. కంపెనీలన్నీ కూడా.. ప్రకటనల విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి. కాగా.. తాజాగా.. సభ్యసాచి కంపెనీ తాజాగా.. మంగళసూత్రం కొత్త డిజైన్ తయారు చేసింది. అయితే.. దాని ప్రకటన మాత్రం.. నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. దీంతో.. సదరు ప్రకటనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం.
ఏస్ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి తాజాగా.. ఓ స్పెషల్ మంగళసూత్రం డిజైన్ చేశారు. అయితే.. మంగళసూత్రం డిజైన్ ఆకట్టుకునేలా ఉన్నా... దాని కోసం తయారు చేసిన ప్రకటన మాత్రం ఎవరికీ ఏ మాత్రం నచ్చలేదు. దీంతో.. ఇది మంగళసూత్రం యాడ్ లా లేదని.. లో దుస్తుల ప్రకటన లాగా ఉందని ట్రోల్ చేస్తున్నారు.
ఇంటిమేట్ ఫైన్ జ్యువెలరీ పేరిట.. మంగళసూత్రం డిజైన్ చేశారు. ఈ మంగళసూత్రాన్ని.. ఓ ఫోటోలో మహిళ ధరించగా.. మరో ఫోటోలో స్వలింగ సంపర్కులు కూడా ధరించడం గమనార్హం.
సబ్యసాచి.. మంగళసూత్రాన్ని కాదు.. లో దుస్తుల సేకరణను ప్రారంభించిందని.. చాలా చెత్తగా ఉందంటూ ప్రకటనపై నెటిజన్లు ట్రోల్ చేయడం గమనార్హం. ఇంకొందరైతే.. ఇది లో దుస్తులు కూడా కాదు.. కండోమ్ యాడ్ లాగా ఉందంటూ ట్రోల్ చేయడం గమనార్హం.
కొందరు మాత్రం మంగళసూత్రం డిజైన్ చాలా బాగుందని.. విపరీతంగా తమను ఆకట్టుకుందంటూ.. కొందరు నెటిజన్లు.. ఆ డిజైన్ పై ప్రశంసలు కురిపించడం గమనార్హం.. ఏది ఏమైనా ఆడిజైన్ ఆకట్టుకోవడం సంగతి పక్కన పెడితే.. దాని ప్రకటన పై విమర్శలే ఎక్కువగా వినపడుతున్నాయి.