పండగ వేళ.. ఈ ఆయుర్వేద చిట్కాలతో మెరిసే అందం మీ సొంతం..!

First Published | Oct 26, 2021, 5:05 PM IST

ఈ సీజన్ లో  గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. కాబట్టి.. ఈ సమయంలో.. మాయిశ్చరైజర్ ఎక్కువగా రాసుకుంటూ ఉండాలి. సల్ఫేట్ లేని మాయిశ్చరైజర్ ని రాసుకోవాలి.

దసరా పండుగ సంబరాలు ముగిసాయి. మరో వారం రోజుల్లో దీపావళి కూడా వచ్చేస్తోంది. దీపాల వెలుగుల్లో మీరు కూడా అందంగా మెరిసిపోవాలని అనుకుంటున్నారా..? అయితే.. కొన్ని సింపుల్ ఆయుర్వేద చిట్కాలతో అందంగా మెరిసిపోవచ్చని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. . వాతావరణానికి అనుగుణంగా ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ అనేక చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. మరి ఆ ఆయుర్వేద చిట్కాలేంటో ఓసారి చూసేద్దామా..

1.డీప్ డీటాక్స్..

చర్మానికి డీప్ డీటాక్స్ చేయడం వల్ల కాంతివంతంగా మెరుస్తుంది. దానిని బయట లభించే క్రీములతో కాకుండా.. ఆయుర్వేదం ప్రకారం.. ఉసిరికాయతో చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం కార్తీక మాసంలోకి అడుగుపెడుతున్నాం. ఈ కార్తీక మాసంలో ఉసిరి పుష్కలంగా లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇది డార్క్ స్పాట్స్ , పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. మొటిమలు పూర్తిస్థాయిలో తగ్గిపోవడానికి కూడా సహాయం చేస్తాయి.
 

Latest Videos


4-5 తాజా ఉసిరికాయలను ఉదయాన్నే రసం తీసి.. దానిలో కొద్దిగా తేనె, పసుపు కలపాలి.  దీనిని ముఖానికి  రాయడం వల్ల చర్మం మెరుస్తుంది. మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయం చేస్తుంది.

ఈ సీజన్ లో  గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. చర్మం ఎక్కువగా పొడిబారుతుంది. కాబట్టి.. ఈ సమయంలో.. మాయిశ్చరైజర్ ఎక్కువగా రాసుకుంటూ ఉండాలి. సల్ఫేట్ లేని మాయిశ్చరైజర్ ని రాసుకోవాలి.
 

చర్మానికి ఉపయోగించే ఉత్పత్తులలో కుంకుమ పువ్వు, గంధం, బంగారం వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి ముఖానికి సహజంగా అందాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తాయి.

oats

ఇవి కాకుండా.. ఓట్స్ ని పొడి చేసుకొని.. అందులో కొవ్వు లేని మజ్జిగ ని కలిపి ముఖానికి రాసుకోవాలి. దీని వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గులాబీ, తామర పూ రెక్కలను మిశ్రమంగా చేసి మరీ రాసుకోవచ్చు. ఫెన్నెల్ ఎసెన్షియల్ ఈ పూ రెక్కల మిశ్రమంలో కలిపి రాసుకోవాలి.  ఇది కూడా ముఖం కాంతి వంతంగా మెరిసేలా చేస్తుంది.

దాదాపు.. చలికాలంలో మంచినీరు ఎక్కువ తాగలేం. కానీ.. దాహంగా లేకపోయినా.. ఈ కాలంలోనూ మంచినీరు ఎక్కువగా తాగాలి. అలా తాగడం వల్ల  కూడా చర్మం  మెరవడానికి సహాయం చేస్తోంది. 

click me!