చీరలంటే ఇష్టపడని మహిళలు ఎవరైనా ఉంటారా..? ఈ రోజుల్లో చాలా మంది చీరలు కట్టకపోయినా.. ఏదైనా ప్రత్యేక సందర్భంలో మెరవాలంటే కచ్చితంగా చీర ఉండాల్సిందే. ఇక ప్రస్తుతం కాలం అమ్మాయిలు.. ట్రెండీ, ఎంబ్రాయిడరీ, పార్టీవేర్ చీరలు మాత్రమేకాదు.. డిజైనర్ బ్లౌజ్ తో పెయిర్ చేసి.. కాటన్, చేనేత చీరలు కూడా కట్టేస్తున్నారు.
Tant Saree
ముఖ్యంగా మన దేశంలో ఎన్నో రకాల చీరలు ప్రతిరోజూ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఏవేవో పేర్లతో ఆకర్షిస్తున్నాయి. అయితే.. ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా.. మన దేశంలో ప్రత్యేకంగా తయారయ్యే చేనేత చీరల తర్వాతే. కాలేజీలో అడుగుపెట్టే అమ్మాయి దగ్గర నుంచి.. అమ్మమ్మలు, నానమ్మల వరకు మెచ్చే చీరలు మన చేనేత చీరలు. మన దేశంలో చేనేత అనేది ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. మామూలుగా కాకుండా.. మన సంప్రదాయాన్నీ, కళాత్మకతను, వృత్తి నైపుణ్యాన్ని మిళతం చేస్తూ ఈ చీరలు నేస్తారు. ఈ రోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈ సందర్భంగా... మన దేశంలో దొరికే.. అత్యంత అద్భుతమైన చేనేత చీరలు ఎక్కడ దొరికుతాయో.. ? కచ్చితంగా మహిళల వార్డో రోబ్ లో మెరవాల్సిన చీరలు ఏంటో ఓసారి చూద్దాం...
Pochampally Saree
పోచంపల్లి చీరలు.. తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో దొరికే అద్భుతమైన చీరలు ఇవి. ఎవరికైనా విపరీతంగా నచ్చేస్తాయి. ఒక్కసారైన కచ్చితంగా కట్టుకోవాల్సిన చీరలు ఇవి.
ఇకరా చీరలు (పశ్చిమ బెంగాల్):
పశ్చిమ బెంగాల్ లో లభించే ‘‘ఇకరా’’చీరలు ఎవరి మనసు అయినా ఇట్టే దోచేస్తాయి. పురాతన కళాకారులు వీటిని తయారు చేస్తారు. దీనిపై ఉంటే డిజైన్లు.. చీరకు ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి.
Kanjivaram
కాంజీవరం చీరలు (తమిళనాడు):
‘‘కాంజీవరం’’ చీరలు అద్భుతమైన పట్టు బట్టతో, భిన్నమైన రంగులు, గోపురం లేదా తాళి డిజైన్లతో ప్రసిద్ధి చెందాయి. ఈ చీరలకు ఒక ప్రత్యేకమైన మెరుపు, సన్నని జరీ కూడా ఉంటాయి. కంచి వెళ్లిన వాళ్లు ఎవరైనా చీర కొనకుండా అక్కడి నుంచి రారు అనే చెప్పాలి.
తమిళనాడుకు చెందిన కంజీవరం చీరలు నైపుణ్యం కలిగిన కళాకారుల నైపుణ్యంతో కూడిన పనిని ప్రదర్శిస్తాయి. ఈ విలాసవంతమైన వస్త్రాలు అధిక-నాణ్యత స్వచ్ఛమైన మల్బరీ సిల్క్‌ని ఉపయోగించి రూపొందిస్తారు., ఇది మెరిసే రూపానికి ప్రసిద్ధి చెందింది. కాంజీవరం చీరలను నిజంగా వేరుగా ఉంచేది వాటి విస్తృతమైన అలంకారమే.
గద్వాల్ చీరలు( తెలంగాణ)
తెలంగాణలోని గద్వాల్ లో మాత్రమే తయారయ్యే ప్రత్యేకమైన చీరలు ఇవి. ఈ చీర కడితే వచ్చే హుందాతనం.. మరే ఇతర చీరలు కట్టినా రాదు అనే చెప్పాలి.
చందేరీ చీరలు( మధ్యప్రదేశ్)
మధ్యప్రదేశ్ నుండి ఉద్భవించిన చందేరి చీరలు భారతదేశం సుసంపన్నమైన వస్త్ర వారసత్వానికి ఉదాహరణగా నిలుస్తాయి, సున్నితమైన హస్తకళ , సున్నితమైన ఆకర్షణను ప్రదర్శిస్తాయి. ఈ చీరలు వారి చేతితో నేసిన డిజైన్‌లు, మెరిసే ఆకృతి , క్లిష్టమైన మూలాంశాలతో వారిని ఎవరినైనా ఇట్టే ఆకర్షించేస్తాయి.
కళంకారీ చీరలు( ఆంధ్రప్రదేశ్)
కలంకారి చీరలు సాంప్రదాయ హస్తకళ కి మారుపేరు. ఈ చీరలు చూస్తేనే వాటి స్పెషాలిటీ ఏంటో క్లియర్ గా అర్థమౌతుంది. ఈ వస్త్రాలు వాటి చేతితో తయారు చేసిన డిజైన్‌ల కారణంగా ప్రత్యేకంగా నిలుస్తాయి, ఇందులో సింబాలిక్ ఎలిమెంట్స్‌తో కూడిన గొప్ప వస్త్రాలు ఉంటాయి. కలంకారి చీరలను అలంకరించే సంక్లిష్టమైన నమూనాలు వివిధ రకాల మూలాధారాల నుండి, ముఖ్యంగా పురాతన భారతీయ పురాణాల నుండి, దేవుళ్ళు, చెట్లు, పువ్వులు, జంతువులు, పక్షుల నుండి ప్రేరణ పొందాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ చీరలుు ముఖ్యంగా మచిలీపట్నం, శ్రీకాళహస్తిలో లభిస్తూ ఉంటాయి. ఏ వయసు వారికైనా నప్పేస్తాయి.