బాదం నూనెలో ఇదొక్కటి మిక్స్ చేసి పెడితే మీ జుట్టు ఊడదు, తెగిపోదు.. పొడుగ్గా పెరుగుతుంది

First Published | Aug 7, 2024, 9:39 AM IST

మనలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. అంతేకాకుండా వెంట్రుకలు కూడా బాగా తెగిపోతుంటాయి. వీటితో పాటుగా జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ.. బాదం నూనె బాగా ఉపయోగపడుతుంది తెలుసా? 

ప్రతి ఒక్క మహిళకు తన జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, షైనీగా, మంచి రంగులో ఉండాలని ఉంటుంది. కానీ నూటిలో ఓ పది మందికి మాత్రమే ఇలాంటి కోరుకున్న జుట్టు ఉంటుంది. చాలా మందికి చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, వెంట్రుకలు తెగిపోవడం, బలహీనమైన జుట్టు వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. వీటివల్ల జుట్టు పెరగడం కూడా ఆగిపోతుంది. ఏండ్లు గడుస్తున్నా జుట్టు మాత్రం ఇంచు కూడా పెరగదు. వాతావరణ కాలుష్యం, చెడు జీవన శైలి వీటికి కారణం. అయితే బాదం నూనెలో కొన్నింటిని కలిపి పెట్టినట్టైతే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. అంతేకాదు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. అందుకే జుట్టు పెరగడానికి బాదం నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

almond oil

కలబంద జెల్

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాబట్టి మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం నూనెలో అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. దీని కోసం ఒక కప్పులో మీ జుట్టుకు సరిపడా నూనెను పోయండి. దీనిలో 1 టీస్పూన్ అలోవెరా జెల్ ను వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 4 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. 



కరివేపాకు

కరివేపాకు కూడా జుట్టుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మీ జుట్టు నేచురల్ గా పొడవుగా పెరగాలంటే బాదం నూనెలో కరివేపాకును మిక్స్ చేసి అప్లై చేయండి. ఇందుకోసం అరకప్పు నూనెలో 7 నుంచి 8 కరివేపాకు వేయండి. ఇప్పుడు ఈ రెండింటినీ గ్యాస్ మీద కొంచెం వేడి చేయండి. బాదం నూనెలో కరివేపాకు కొద్దిగా నల్లగా మారిన తర్వాత స్టవ్  ఆపేసి నూనె చల్లారనివ్వండి. ఇప్పుడు రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టుకుని ఉదయాన్నే తలస్నానం చేయండి. 

మెంతులు 

మెంతులతో కూడా మనం ఎన్నో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో బాదం నూనె తీసుకుని అందులో అర టీస్పూన్ మెంతులను వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంట మీద వేడి చేయండి. మెంతులు ఎరుపు రంగులోకి మారే వరకు మరిగించి తర్వాత స్టవ్ ను  ఆపేయండి. ఈ నూనె చల్లారిన తర్వాత జుట్టుకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఈ మూడు హోం రెమెడీస్ ను ఫాలో అయితే ఖచ్చితంగా మీ జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. 

Latest Videos

click me!