సమంత తన చీరలో ఇద్దరు బైక్ నడుపుతున్నట్లు, చైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫ్యామిలీ వంటి అనేక చిత్రాలు ఉన్నాయి. సమంతా , చైతన్య జీవితంలోని ఒక ప్రత్యేక సందర్భం కూడా చీరపై క్లిష్టంగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది. అప్పుడు ఆ ఫోటోలు అందరినీ ఆకర్షించాయి. ఇప్పుడు మళ్లీ ఈ ఎంగేజ్మెంట్ తో.. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ గా మారడం విశేషం.
అయితే 2021లో సమంత, చైతన్య విడిపోయారు.ఈ జంట తమ విడాకులను సంయుక్త ప్రకటనలో ప్రకటించారు. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత శోబితా , నాగ చైతన్య డేటింగ్ ప్రారంభించారు. వీరిద్దరూ కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉండగా.. ఇప్పుడు.. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారు.