కరివేపాకు, ఉసిరి నూనె పెడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది

First Published | Aug 9, 2024, 12:43 PM IST

ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఈ తెల్ల వెంట్రుకలు కనిపించకూడదని వారానికోసారి కలర్ ను వాడుతూనే ఉంటారు. కానీ మీరు ఉసిరి, కరివేపాకుతో నూనును తయారుచేసి పెట్టుకుంటే మాత్రం మీ జుట్టుకు రంగు వేయాల్సిన అవసరమే ఉండదు.
 

నేటి జీవనశైలి కారణంగా జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లబడటం వంటి జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం, రసాయన ఉత్పత్తులు మొదలైనవి జుట్టు సమస్యలకు అసలు కారణాలు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఉసిరికాయలు, కరివేపాకుతో తయారుచేసిన నూనె చాలా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

hair care


కరివేపాకు, ఉసిరి గుణాలు 

కరివేపాకు, ఉసిరికాయలు మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 


కరివేపాకు, ఉసిరి నూనె 

కరివేపాకు, ఉసిరికాయలతో తయారుచేసిన నూనె జుట్టును బలంగా చేయడంతో పాటుగా తెల్ల జుట్టు, హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం కరివేపాకును ఉసిరి పొడిలో వేసి బాగా కలపండి. ఈ పేస్ట్ లో కొబ్బరినూనె వేయండి. అంతే .. ఈ నూనెను మీ జుట్టుకు అప్లై చేయొచ్చు. 

hair care

ఈ నూనెను ఎలా పెట్టాలి? 

కరివేపాకు, ఉసిరికాయల నూనెను జుట్టుకు వేళ్ల సాయంతో బాగా అప్లై చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి 2 గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. ఈ నూనె జుట్టుకు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయంటే? 
 

hair care

జుట్టు పెరుగుదల 

జుట్టు పొడుగ్గా ఉండాలని ప్రతిఒక్క మహిళకూ ఉంటుంది. కానీ చాలా మందికి పొట్టి జుట్టే ఉంటుంది. అయితే మీరు గనుక కరివేపాకు, ఉసిరి నూనెను జుట్టుకు పెట్టినట్టైతే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. ఈ రెండింటిలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. దీన్ని ఉపయోగించడం వల్ల చిట్లిన వెంట్రుకలు తొలగిపోతాయి.
 

hair care

ఒత్తైన, బలమైన జుట్టు 

జుట్టు బలహీనంగా ఉంటే వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. దీనికి ఉసిరి, కరివేపాకు ఎంతో మేలు చేస్తాయి. అవును ఈ రెండూ జుట్టును ఒత్తుగా, బలంగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

hair care

తక్కువ జుట్టు రాలడం

వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతే నెత్తి పల్చగా అవుతుంది. జుట్టు సస్నగా అవుతుంది. అయితే పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ నూనెను ఉపయోగించడం వల్ల మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. ఇది మీ జుట్టును మూలాల నుంచి బలంగా చేస్తుంది.
 

hair care

తెల్ల జుట్టు సమస్య

కరివేపాకులో ఉండే గుణాలు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బాగా సహాయపడతాయి. దీనికి ఉసిరిని కలపడం వల్ల నెత్తిమీద బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపడుతుంది. దీంతో మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. 
 

Latest Videos

click me!