అక్కినేనివారి కాబోయే కోడలు శోభితా అంత ఫిట్ గా ఉండటానికి రీజన్ ఇదే..!

First Published | Aug 9, 2024, 11:03 AM IST

ఆమె ఫిట్నెస్  కి కూడా ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మరి.. శోభితా తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

శోభితా దూళిపాళ్ల.. అచ్చమైన తెలుగు అమ్మాయి. ఇటు.. టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ నటిగా తన సత్తా చాటింది. మొన్నటి వరకు.. కేవలం నటిగా పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు అక్కినేనివారి  ఇంటి కాబోయే కోడలిగా త్వరలోనే అడుగుపెట్టనుంది. శోభితాతో.. నాగ చైతన్య ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. సడెన్ గా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోగా.. ఆ ఫోటోలను నాగార్జున షేర్ చేయడంతో  ఈ విషయం  బయటకు వచ్చింది.

ఈ విషయం పక్కన పెడితే... శోభితా స్టన్నింగ్ బ్యూటీ అని చెప్పొచ్చు. ఆమె నటించిన మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ లో.. ఆమె అందం మాత్రమే కాదు.. ఆమె ఫిట్నెస్  కి కూడా ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మరి.. శోభితా తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం..
 


శోభితాను డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టమట. రెగ్యులర్ గా డ్యాన్స్ చేస్తూ ఉంటుందట. డ్యాన్స్ అనేది కేవలం ఫన్ యాక్టివిటీ మాత్రమే కాదు.. ఫిట్ గా ఉండటానికి కూడా సహాయపడుతుంది. డ్యాన్స్ చేయడం వల్ల.. క్యాలరీలు బర్న్ అవుతాయి..  గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. మూడ్ మంచిగా ఉంటుంది. డ్యాన్స్ ఫుల్ బాడీ వ్యాయామంగా పని చేస్తుంది.  ఇది మంచి వ్యాయామం కాబట్టి... ఇది ఫిట్ గా ఉండాటానికి హెల్ప్ అవుతుంది.
 

Sobhita Dhulipala

ఇక.. శోభితా తన ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందట.  నిజానికి శోభితా మంచి ఫుడ్ లవర్. అయితే.. అలా అని జంక్ ఫుడ్ మాత్రం తినదట. మంచి బ్యాలెన్స్డ్ డైట్ ని తీసుకుంటుందట. తన ఆహారంలో పండ్లు, కూరగాయలు, నట్స్ లాంటివి అన్నీ ఉండేలా చూసుకుంటూ ఉంటారట.

Actress Sobhita dhulipala

అంతేకాదు.. శోభితా తన డైట్ లో నెయ్యి ఎక్కువగా తీసుకుంటారట. నెయ్యిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.  నెయ్యి.. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా, మెటబాలిజం మెరుగుపడటంలోనూ, ఓవరాల్ గా ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఉండే విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. శోభిత కచ్చితంగా తన భోజనంలో నెయ్యి ఉండేలా చూసుకుంటుందట.

ఇక.. శోభితా తన మనసును సంతోషంగా, రిలాక్స్ గా  ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందట. దాని కోసం.. ఆమె ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటారట.  ఈ అలవాటు ఆమె మెదడును చురుకుగా ఉంచడానికి సహాయం చేస్తుందట.

తన బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడానికి, ఎక్కువగా వ్యాయామాలు చేస్తూ ఉంటుందట. వాటి కారణంగా... బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండటంతోపాటు... మొత్తం బాడీ స్ట్రెంత్ పెరగడానికి కూడా సహాయపడుతుంది.

ఇక..ఆమె రెగ్యులర్ గా.. యోగా చేస్తూ ఉంటారట. యోగా తన బాడీని ఫిట్ గా ఉంచడంతో పాటు... చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బాడీకి ఫ్లెక్సిబులిటీ, మజిల్ స్ట్రెంత్ పెరగడానికి, ఫుల్ గా రిలాక్స్ అవ్వడానికి సహాయం చేస్తుంది. 

అంతేకాదు.. ఆమె తన బాడీ ఫిట్ గా ఉంచడానికి మార్షల్ ఆర్ట్స్ కూడా చేస్తూ ఉంటుందట. ఇది ఫోకస్ పెంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా.. సెల్ఫ్ డిఫెన్స్  స్కిల్స్ కూడా మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. అంతేకాకుండా.. రెగ్యులర్ గా ఆమె వెయిట్ లిఫ్టింగ్ చేయడం కూడా చేస్తూ ఉంటారట. 
 

Latest Videos

click me!