ఈరోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. కాలేజీకి వెళ్లే పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఇక ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది హెయిర్ కలర్స్ వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీని వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది. జుట్టు మరింత ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ లాస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. మనం సహజంగా తెల్ల జుట్టును మళ్లీ నల్లగా మార్చవచ్చు. దానికోసం ఆవ నూనె ఒక్కటి చాలు. మరి, ఈ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
25
చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలు..
చిన్న వయసులో తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉంటాయి.ఉదాహరణకు జుట్టు తెల్లబడటానికి మొదటి కారణం విటమిన్ బి12, విటమిన్ డి, ఈ, ఖనిజాల లోపం కావచ్చు. వీటితో పాటు సరైన ఆహారం తీసుకోకపోవడం, లైఫ్ స్టైల్ లో మార్పులు,ఒత్తిడి కూడా కారణం కావచ్చు.
35
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఏం చేయాలి?
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మీకు 2 కప్పుల ఆవాల నూనె, 2 టీ స్పూన్ల మెంతుల గింజలు, 1 టీ స్పూన్ల నల్ల జీలకర్ర, 2 టీస్పూన్ల ఆమ్లా పొడి, 1 టీ స్పూన్ కుంకుడు కాయలు అవసరం. మీకు కావాలంటే, దీనిలో కలబంద జెల్ కూడా ఉపయోగించవచ్చు. ముందుగా, ఒక పాన్ తీసుకొని దానిలో 2 కప్పుల ఆవాల నూనెను వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత, మిగతా పదార్థాలన్నింటినీ వేసి మీడియం మంట మీద ఉడికించాలి. నూనెలో కలిపిన ప్రతిదీ నల్లగా మారే వరకు ఉడికించాలి. నూనెను 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, నూనెను ఒక పాత్ర లేదా గాజు సీసాలో నిల్వ చేయండి.
పోషకాహారం లేకపోవడం వల్ల మన జుట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ దానిని నల్లగా చేయడానికి రసాయనాలను ఉపయోగించలేరు. కాబట్టి, మీరు ఈ నూనెను ఉపయోగించి మీ , మీ తెల్ల జుట్టును నల్లగా చేసుకోవచ్చు. ప్రతి రాత్రి పడుకునే ముందు మీ తలపై మసాజ్ చేసి అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా సహజంగా మారుతుంది. ఆవ నూనె మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది.
55
ఆవ నూనెతో జుట్టుకు ప్రయోజనాలు...
అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి ఆవనూనెను జుట్టుకు వాడుతూ ఉన్నారు. ఈ నూనెను ఇప్పటికీ వాడేవారు చాలా మంది ఉంటారు. ఈ నూనె రాయడం వల్ల జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఆవ నూనెలో ఉసిరికాయ పొడి, కాఫీ పొడి, మెంతులు, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి హెయిర్ ప్యాక్ లా రాసినా కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనిని.. కూడా నూనెతో కలిపి మరిగించి కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను తలస్నానం చేయడానికి గంట ముందు రాసుకొని.. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ నూనెను రెగ్యులర్ గా వాడటం వల్ల.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.