Beauty
చర్మాన్ని అందంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అలా అందంగా మార్చుకోవడానికి పైపై పూతలు పూస్తే సరిపోదు. మనం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా అలవాటు చేసుకోవాలి. మరి ఆ అలవాట్లు ఏంటో ఓసారి చూద్దాం..
beauty
1. చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం. దానికోసం ఉదయాన్నే మంచిీరు తాగడడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే ఇలా నీరు తాగడం వల్ల శరీరం హైడ్రెట్ గా ఉండటంతో పాటు, చర్మం అందంగా మెరవడానికి సహాయపడుతుంది.
2.మన ముఖంపై నూనె పేరుకుపోయి, చర్మం పాడౌతూ ఉంటుంది. అయితే, దానిని తొలగించడానికి ఉదయాన్నే క్లెన్సర్ ని ఉపయోగించాలి. క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
3.ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత పీహెచ్ బ్యాలెన్సింగ్ టోనర్ ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం అందంగా మారుతుంది.
4.చర్మం అందంగా మారడానికి రెగ్యులర్ గా సీరమ్ అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. సీరమ్్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి, మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి.
5.కంటి కింద వలయాలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటివారు ఐ క్రీమ్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత కంటి కింద ఐ క్రీమ్ ని సున్నితంగా అప్లై చేయాలి. అదేవిధంగా ఇలా అప్లై చేయడం వల్ల కంటి కింద ఉబ్బినట్లుగా ఉండటం కూడా తగ్గిపోతుంది.
6.ఇక, క్రమం తప్పకుండా ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి , తేమగా ఉండటానికి సహాయపడుతుంది.
7.చాలా మంది కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ లోషన్ రాయాలి అనుకుంటారు. కానీ, ఇంట్లో ఉన్నా, కూడా దీనిని రాయడం అలవాటు చేసుకోవాలి.
8. ఇక ఉదయం పూట తీసుకునే బ్రేక్ ఫాస్ట్ సైతం ఆరోగ్యంగా ఉండేలా చూసకోవాలి. అంటే, ఆ బ్రేక్ ఫాస్ట్ లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాలి.
9.ఇక ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల చర్మం అందంగా మారుతుంది. జిమ్ లో కసరత్తులు చేయడం, లేదంటే, వాకింగ్, జాగింగ్ లాంటివి చేయవచ్చు.