కృతి సనన్ టాలీవుడ్ కి మహేష్ నేనొక్కడినే సినిమాతో పరిచయం అయ్యింది. కానీ, ఈ మూవీ హిట్ కాకపోవడంతో ఆమె మళ్లీ టాలీవుడ్ లో కనపడలేదు. బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా కాలం తర్వాత ఆమె ప్రభాస్ ఆదిపురుష్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Moisturising Sunscreen
ఇప్పటికే ఈ మూవీ విడుదలకాగా, మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, అందులో కృతి లుక్ కి అందరూ ఫిదా అయిపోయారు. సీత అమ్మవారి పాత్రలో కృతి ఒదిగిపోయింది. చాలా అందంగా కూడా కనిపించింది. కృతి తన అందాన్ని మెరుగు పరుచుకోవడానికి ఫిట్నెస్ విషయంలో చాలా ఫోకస్ గా ఉంటుందట. మరి ఆమె అందంతోపాటు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం..
Hydrate Your Skin
కృతి ఫిట్నెస్ మంత్ర చాలా మందికి ఇన్సిపిరేషన్ అని చెప్పొచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. తాను ఏదైనా షూటింగ్ కి వేరే ప్రదేశానికి వెళ్లి, అక్కడ జిమ్ సదుపాయం లేకపోయినా, ఆమె ఫిట్నెస్ ని పక్కన పెట్టదట. జిమ్ లేనప్పుడు, ఇతర ఇంట్లో చేసుకోగలిగేలా ఉండే వ్యాయామాలు చేస్తూ ఉంటుందట.
Green Tea Toner
ఆమె జిమ్ లో ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటారట. మిగిలిన సమయంలో తాను చేయగలిగే వ్యాయామాలు చేస్తూ ఉంటారట. ఇక, తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ఆమె డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారట. ఇది తనకు ఇష్టమైన వ్యాయామ ప్రక్రియ అని ఆమె ఓసారి చెప్పడం విశేషం
ఇక, ఆమె ప్రతిరోజూ క్రమం తప్పకుండా, మెడిటేషన్ చేస్తూ ఉంటుందట. దీని వల్ల తన ఆరోగ్యం చక్కగా ఉంటుందని ఆమె నమ్ముతారట. ఇక, డైట్ విషయంలోనూ ఆమె అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాలెన్సడ్ డైట్ ని మాత్రమే తీసుకుంటారు.
కృతి తన చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. క్రమం తప్పకుండా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతుందట. మార్నింగ్ రొటీన్ అనుసరిచడం నుంచి, రాత్రి మేకప్ తొలగించడం వరకు తాను తీసుకునే జాగ్రత్తలను ఆమె ఇటీవల పంచుకున్నారు.
ఆమె తన ముఖానికి ఉన్న మేకప్ తొలగించడానికి క్లెన్సింగ్ ఆయిల్ వాడుతూ ఉంటారట. తనకు క్లెన్సింగ్ ఆయిల్ అంటే ఇష్టమని ఆమె చెప్పడం విశేషం. ఆ తర్వాత ఫేస్ వాష్ తో తన ముఖాన్ని మరోసారి శుభ్రం చేసుకుంటుందట.
డబుల్ క్లీన్సింగ్ మురికి, నూనె, చెమట చర్మంపై వర్తించే ఏదైనా ఉత్పత్తులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం కోలుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా సహజ మరమ్మత్తు ప్రక్రియ జరిగేలా చేస్తుంది.
చర్మం కోలుకోవడానికి, సహజమైన మరమ్మత్తు ప్రక్రియ జరిగేలా చేయడానికి , మేకప్‌లను తొలగించడం చాలా అవసరం అని ఆమె తెలిపింది.
ఇక తన చర్మాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఆమె ఆహారం విషయంలో నూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. తాను తన చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి మంచినీరు ఎక్కువగా తీసుకుంటుందట. దానితో పాటు, కూరగాయల జ్యూస్ కూడా ఆమె రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటుందట.
మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని టాక్సీన్స్ అన్నీ తొలగిపోతయాని ఆమె చెప్పడం విశేషం. కాగా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉంటానని ఆమె తెలిపారు.