పుట్టు మచ్చలను కూడా సింపుల్ గా తీసేయెచ్చా..?

First Published | Jul 23, 2023, 8:57 AM IST

చర్మం సాధారణంగా మారడానికి సహాయపడుతుందట. కాబట్టి, దీనిని మీకు ఇబ్బందిగా మారిన పుట్టుమచ్చల దగ్గర రాస్తే సరిపోతుంది.

పుట్టు మచ్చలు పేరులోనే ఉంది. ఇవి మనకు పుట్టుకతోనే వస్తాయి. కొందరికి ఆ పుట్టు మచ్చలు చాలా అందాన్ని తెస్తాయి. కానీ, కొందరికి మాత్రం ఆ పుట్టు మచ్చలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందాన్ని పోగొడుతూ ఉంటాయి. అయితే, కొన్ని సింపుల్ హోమ్ రెమిడీస్ తో ఈ పుట్టు మచ్చలను శాశ్వతంగా తొలగించవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం..
 

castor oil

1.బేకింగ్ సోడా, ఆముదం

ముందుగా ఓ గిన్నెలో బేకింగ్ సోడా, ఆముదం రెండింటినీ తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై ఇబ్బంది పెడుతున్న పుట్టుమచ్చలపై పూయాలి. పూర్తిగా ఎండిపోయిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల నల్లగా ఉండే పుట్టుమచ్చలను నెమ్మదిగా నార్మల్ స్కిన్ గా మారిపోతాయట.

Latest Videos


2.యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పుట్టుమచ్చలు తగ్గిపోయి, చర్మం సాధారణంగా మారడానికి సహాయపడుతుందట. కాబట్టి, దీనిని మీకు ఇబ్బందిగా మారిన పుట్టుమచ్చల దగ్గర రాస్తే సరిపోతుంది.
 

Image: Freepik


3.వెల్లుల్లి నూనె..
గార్లిక్ నూనె మార్కెట్లో సులభంగా లభిస్తుంది. దీనిని కూడా మీరు పుట్టుమచ్చలను తొలగించడానికి ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ రాయడం వల్ల, కొన్ని రోజుల తర్వాత మీరు ఫలితం చూస్తారు.ఈ నూనెలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి నల్ల మచ్చలను శాశ్వతంగా తొలగించడానికి సహాయపడతాయి.
 

4.కలబంద గుజ్జు..
కలబంద గుజ్జును సాధారణంగా అందం పెంచుకోవడానికి వాడతారు. అయితే, ఇది కూడా ముఖం పై మచ్చలను తొలగించడానికి సహాయం చేస్తుంది. అయితే, క్రమం తప్పకుండా అప్లై చేస్తూ ఉండాలి.

coconut oil

5.కొబ్బరినూనె..
నమ్మసక్యంగా లేకపోయినా కొబ్బరి నూనె కూడా పుట్టుమచ్చలను తొలగిస్తుందట. అయితే, పూర్తిగా కాకపోయినా, దాని పరిమాణాన్ని మాత్రం తగ్గిస్తుందట. కాబట్టి, ప్రతిరోజూ ప్రయత్నించండి.

honey

6.తేనె..
తేనెలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది కూడా పుట్టుమచ్చ పరిమాణాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది.

Flax Seeds

7.అవిసెగింజల నూనె..
అవిసె గింజల్లో ఉండే లక్షణాలు ఎలాంటి మచ్చలను అయినా సులభంగా తొలగించేస్తాయట. ఈ నూనె తో పుట్టుమచ్చలను కూడా సులభంగా తొలగించవచ్చు.
 

Image: Freepik

8.పొటాటో జ్యూస్.
పొటాటో జ్యూస్ సాధారణంగానే మన అందాన్ని పెంచుతుంది. ఎలాంటి మచ్చలనైనా తొలగించడానికి సహాయపడుతుంది. ఇది కూడా పుట్టుమచ్చల పరిమాణం తగ్గించడానికి సహాయపడుతుంది.
 

tea tree oil


9.టీట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్ కూడా క్లియర్ స్కిన్ కి సహాయపడుతుంది. దీనిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పుట్టుమచ్చలపై రాయడం వల్ల ఫలితం తొందరగా కనపడుతుందట.

click me!