తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

Hair Care: పెరుగులో ఇదొక్కటి కలిపి రాస్తే,జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది..!

ramya Sridhar | Published : Apr 11, 2025 10:22 AM

మీ జుట్టు పొడవుగా పెరగాలని, జుట్టురాలడం తగ్గాలి అంటే మీరు ముందు బయట కెమికల్స్ ఉండే ఉత్పత్తులు వాడటం మానేయాలి.కేవలం సహజ ఉత్పత్తులపై ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు వీలైనంత వరకు హెయిర్ డ్యామేజ్ కాకుండా ఆపగలం.

15
Hair Care: పెరుగులో ఇదొక్కటి కలిపి రాస్తే,జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది..!
curd hair mask


ఈరోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడినా కూడా ఈ సమస్యను పరిష్కరించలేపోతున్నారు.మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? జుట్టు బాగా రాలిపోయి ముఖంలో అందం తగ్గిపోయిందని ఫీలౌతున్నారా? అయితే వేల రూపాయలు ఖర్చు చేయకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఈ సమస్యను మీరు పరిష్కరించొచ్చు. కేవలం జుట్టు రాలడం ఆగడం కాదు..జుట్టు వేగంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. మరి, దాని కోసం తలకు ఏం రాయాలో చూద్దామా..

25

మీ జుట్టు పొడవుగా పెరగాలని, జుట్టురాలడం తగ్గాలి అంటే మీరు ముందు బయట కెమికల్స్ ఉండే ఉత్పత్తులు వాడటం మానేయాలి.కేవలం సహజ ఉత్పత్తులపై ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు వీలైనంత వరకు హెయిర్ డ్యామేజ్ కాకుండా ఆపగలం. ఇప్పుడు జుట్టు పెరగడానికి పెరుగు వాడితే సరిపోతుంది. జస్ట్ పెరుగు కాకుండా అందులో కలబంద కూడా చేర్చాలి.


జుట్టు పెరుగుదలలో కలబంద ప్రధాన పాత్ర పోషిస్తుంది. కలబందలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.దీనిలో ఉండే పోషకాలు జుట్టురాలడాన్ని పూర్తిగా ఆపేసి, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది
 
 

35

పెరుగు, కలబంద హెయిర్ మాస్క్...

కలబంద జెల్
కొబ్బరి నూనె
పెరుగు
వంటకం

కలబంద మొక్కను తీసుకొని, పైభాగంలో చీలిక చేసి, మధ్యలో ఉన్న జెల్‌ను మాత్రమే వేరు చేయండి.వేరు చేసిన జెల్‌ను చల్లటి నీటితో 3 సార్లు బాగా కడగాలి.కలబందను బ్లెండర్‌లో వేసి, దానికి రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె, 2 టీస్పూన్ల పెరుగు జోడించండి. ఇప్పుడు దీనిని బాగా కలపాలి. అంతే హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే.. 

మీ తలకు హెయిర్ మాస్క్‌ను అప్లై చేసే ముందు, చిక్కులను తొలగించడానికి మీ జుట్టును బాగా దువ్వండి.తరువాత, తయారుచేసిన కలబంద పేస్ట్‌ను మీ తలకు, జుట్టుకు బాగా రాయాలి. తర్వాత నెమ్మదిగా వేళ్లతో మసాజ్ చేయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చాలు.తలస్నానం చల్లటి నీటితో చేయడం ఉత్తమం. ఈ హెయిర్ మాస్క్ జుట్టు పొడవుగా పెరగడానికి, చుండ్రు తొలగిపోవడానికి సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు  ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

45

కలబంద, ఆముదం, విటమిన్ E
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, మీరు కలబంద, ఆముదం, విటమిన్ E లను కలిపి అప్లై చేయవచ్చు. దీని కోసం, 5-6 చెంచాల కలబంద జెల్ తీసుకోండి. దానికి కాస్టర్ ఆయిల్, విటమిన్ E క్యాప్సూల్ ఆయిల్ జోడించండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలపండి. మీ జుట్టు, తలకు బాగా అప్లై చేయండి. ఒక గంట తర్వాత, మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ పేస్ట్‌ను వారానికి 1-2 సార్లు అప్లై చేయ వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, జుట్టు మృదువుగా,  అందంగా మారుతుంది.

55

జుట్టు పెరుగుదలకు కలబంద, పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు


మీరు మీ జుట్టుకు క్రమం తప్పకుండా కలబంద జెల్ రాసుకుంటే, అది మీ జుట్టు మెరిచేలా చేస్తుంది. కుదుళ్లను బలంగా చేస్తుంది.  జుట్టు ఆరోగ్యంగా మారుతుంది, దాని పెరుగుదల వేగంగా ఉంటుంది జుట్టు నడుము వరకు పొడవుగా మారుతుంది.తలకు ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది. పెరుగు జుట్టుకు మంచి తేమను అందిస్తుంది. జుట్టు ఎండిపోకుండా, ఎప్పుడూ మృదువుగా ఉండేలా చేస్తుంది. సూర్య కిరణాల నుంచి జుట్టును రక్షించడానికి కూడా సహాయం చేస్తుంది. ఇక పెరుగు, కలబంద గుజ్జు రెండూ కలిపి రాస్తే..జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

Read more Photos on
click me!
Recommended Photos