
ముఖం మీద మొటిమలు, మచ్చలు ఉంటే ఎవరికైనా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఒక్క చిన్న మొటిమ.. ముఖం అందం మొత్తం పాడు చేసేస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. ఇక మొటిమలు, దాని తాలుకా వచ్చే మచ్చలు తొలగించడానికి చాలా మంది చాలా రకాల క్రీములు, ఫేషియల్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ, అవేమీ పూయకపోయినా అందంగా కనిపించొచ్చు. దానికోసం.. హోం రెమిడీలు ప్రయత్నిస్తే చాలు.
ప్రతి ఒక్కరి ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది. ఆ కొబ్బరి నూనెలో పటిక కలిపి ముఖానికి రాస్తే ఎలాంటి మచ్చలు అయినా పోవాల్సిందే. కొబ్బరి నూనె, పటిక రెండూ చర్మానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. కొబ్బరి నూనె చర్మానికి పోషణ అందించడంతో పాటు మంచి తేమను అందిస్తుంది. పటిక క్రిమినాశక, శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిపి రాస్తే.. ఎంతటి చర్మ సమస్యలు అయినా చాలా ఈజీగా తొలగిపోతాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. ఈ చిట్కా అటువంటి వారికి సమర్థవంతంగా పనిచేస్తుంది. పటికలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని మంట, ఎరుపు నుండి రక్షిస్తుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
చర్మపు మంట,చికాకు తగ్గిస్తుంది
సున్నితమైన చర్మం ఉన్నవారికి చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దురద, చికాకు ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ఈ కొబ్బరి నూనె,పటిక చిట్కాను ఉపయోగించడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చర్మానికి మంచి ఉపశమనం కలిగిస్తుంది.పటిక సహజ ఆస్ట్రింజెంట్‌గా పనిచేస్తుంది. ఓపెన్ పోర్స్ సమస్యను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె చర్మం నుండి మురికి, చనిపోయిన కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా,ప్రకాశవంతంగా చేస్తుంది.మీ ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
కొబ్బరి నూనె ,పటికను ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు ,పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖంపై నల్లటి మచ్చలు తగ్గుతాయి. దీని వల్ల ముఖంలో గ్లో పెరుగుతుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు తరచుగా ముఖంపై అదనపు నూనెతో సమస్యలను ఎదుర్కొంటారు. పటిక చర్మం నుండి అదనపు నూనెను తొలగిస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని పొడిబారకుండా సమతుల్యం చేస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది ముడతలు ,ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
ఈ మిశ్రమాన్ని తయారు చేయానికి…
ముందుగా, ఒక టీస్పూన్ కొబ్బరి నూనె తీసుకోండి.
దానికి కొంచెం పటిక పొడి కలపండి.
ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై తేలికగా అప్లై చేయండి.
15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
ఈ మిశ్రమాన్ని వారానికి రెండు నుండి మూడు సార్లు ఉపయోగించవచ్చు. అయితే, దీనిని వాడే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం చాలా ముఖ్యం.