Hair Growth: కొబ్బరి నూనెలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే చాలు

Published : Feb 03, 2025, 12:40 PM IST

నార్మల్ కొబ్బరి నూనె కాకుండా..  అందులో కనుక  కొన్ని కలిపి రాయడం వల్ల జుట్టు చాలా పొడ్డుగ్గా పెరగడమే కాకుడా..  తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదట. మరి, అవేంటో తెలుసుకుందామా...  

PREV
14
Hair Growth: కొబ్బరి నూనెలో ఇవి కలిపి జుట్టుకు రాస్తే చాలు
hair oiling

పొడవైన , మందపాటి జుట్టు కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా అమ్మాయిలు.. అలాంటి జుట్టు కోసం కలలు కంటారు. కానీ, ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న కాలుష్యం, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం లాంటి చాలా కారణాల వల్ల జుట్టు బలహీనంగా మారిడం, తొందరగా ఊడిపోవడం, చాలా తక్కువ సమయంలోనే నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లగా మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎక్కువ మంది కొబ్బరి నూనె రాస్తూ ఉంటారు. అయితే.. కేవలం నార్మల్ కొబ్బరి నూనె కాకుండా..  అందులో కనుక  కొన్ని కలిపి రాయడం వల్ల జుట్టు చాలా పొడ్డుగ్గా పెరగడమే కాకుడా..  తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదట. మరి, అవేంటో తెలుసుకుందామా...

24

జుట్టు బాగా రాలిపోకుండా ఉండాలని చాలా మంది  ఖరీదైన హెయిర్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఖరీదైన చికిత్సలు చేయించుకోవడం అందరికీ కుదరదు.  అలాంటివారు కేవలం ఈ హోం రెమిడీలు ఫాలో అయితే సులభంగా  జుట్టు సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. 

సాధారణంగా అందరూ జుట్టు బాగుండాలని కొబ్బరి నూనె రాస్తూ ఉంటారు.  ఆ కొబ్బరి నూనెలో మనం కరివేపాకు వేసి రాస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందట. ఈ రెండూ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.  కొబ్బరి నూనె జుట్టుకు మంచి పోషణ, తేమను అందిస్తుంది. ఇవి జుట్టు రాలకుండా నివారించడంలోనూ సహాయపడుతుంది. అదే సమయంలో కరివేపాకు.. జుట్టు తెల్లగా మారకుండా, నల్లగా నిగనిగలాడేలా చేయడానికి సహాయపడుతుంది..

34

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ క్యాప్సిల్ లో ఉండే నూనె కూడా కలిపి కూడా రాసుకుంటూ ఉండాలి. ఇలా రాయడం వల్ల జుట్టు చివరలు చిట్లిపోకుండా.. బాగా పెరగడానికి సహాయపడుతుంది.

మీరు దాల్చిన చెక్క పొడిని కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బలపడటమే కాకుండా చుండ్రు తొలగిపోతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
 

44

జుట్టుకు వేప
వేప ఆకుల పొడిని తయారు చేసి, ఈ పొడిని కొబ్బరి నూనెతో కలిపి మీ జుట్టుకు అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి కొంత సమయం తర్వాత మీ జుట్టును కడగవచ్చు. మీరు ఈ ప్రక్రియను వారానికి రెండుసార్లు పునరావృతం చేయవచ్చు. ఇది మీ జుట్టు రాలడాన్ని ఆపి, మూలాల నుండి బలంగా చేస్తుంది.

జుట్టు పొడవుగా పెరగడానికి నూనెను ఎలా తయారు చేయాలి?
ఈ నూనెను ఉపయోగించడానికి, మొదట మీ జుట్టును బాగా దువ్వండి. ఆ తర్వాత, ఈ నూనెను తలకు అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. రాత్రంతా లేదా కనీసం 2 గంటలు జుట్టు మీద ఉంచండి. తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ నూనెను వారానికి కనీసం రెండుసార్లు అప్లై చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.

click me!

Recommended Stories