తేనెతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇది మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. మరి, దానికోసం దాంట్లో ఇంకా ఏమేమి కలపొచ్చో చూద్దాం...
ఫేస్ ప్యాక్ చేయడానికి
కలబంద జెల్ - 2 టేబుల్ స్పూన్లు
గ్లిజరిన్ - 1 టీస్పూన్
తేనె - 1 టీస్పూన్
గమనిక – మీరు కోరుకుంటే, మీరు ఈ ప్యాక్‌కు 2-3 చుక్కల ఆలివ్ ఆయిల్‌ను జోడించవచ్చు.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి రెండు చెంచాల కలబంద జెల్, ఒక చెంచా తేనె, ఒక చెంచా గ్లిజరిన్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను మీ ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా రెండు రోజులకి ఒకసారి కనీసం నెలరోజులు రాసుకున్నా.. మీ ముఖంలో మార్పులు స్పష్టంగా చూస్తారు. కాంతి వంతంగా మెరుస్తూ కనపడుతుంది.